Mobile Explodes |
మొబైల్‌లో వీడియోలు వీడియోలు చూస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో మొబైల్ ఫోన్ పేలింది. ఈ ప్రమాదంలో ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కేరళ త్రిసూర్ జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. పంచాయతీ బోర్డు సభ్యుడు అరుణ్ కుమార్ తన ఆదిత్య శ్రీ (8) మొబైల్‌లో వీడియో చూస్తున్నది.
ఈ సమయంలో ఫోన్ ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వేసవికావడంతో పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ఇంట్లోనే ఉన్న ఆదిత్య శ్రీ మొబైల్‌లో గంటల తరబడిగా వీడియోలు చూస్తుండేదని కుటుంబీకులు తెలిపారు.
రోజూ మాదిరిగానే ఫోన్‌లో వీడియోలు చూస్తున్న సమయంలో చేతిలోనే బ్లాస్ట్ జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేలుడు చేతులు, ముఖం, పొత్తి కడుపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. అయితే, పేలుడు జరిగిన సమయంలో పాపతో పాటు ఆమె నానమ్మ మాత్రమే ఉన్నది.
ఫోన్ పేలుడు శబ్దానికి స్థానికులు వెంటనే ఇంట్లోకి వచ్చి పాపను దవాఖానకు తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలడంతోనే చిన్నారి మృతి చెందిందని ప్రాథమికంగా నిర్ధారించారు. గత మూడేళ్లుగా ఆ ఫోన్ వాడుతున్నారని, మూడు నెలల కిందటనే బ్యాటరీని మార్చారని పోలీసులు పేర్కొన్నారు.
చాలా సమయం నుంచి మొబైల్‌లో వీడియోలు చూస్తుండడంతో వేడెక్కి బ్యాటరీ పేలి ఉంటుందని అనుమానిస్తున్నారు. బ్లాస్ట్ అయిన మొబైల్ ఫోన్‌ను పోలీసులు ఫొరెన్సిక్ పరీక్షల కోసం పంపారు. ఫొరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత పేలుడుకు ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పేర్కొన్నారు.