Rahul Gandhi | లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. అయితే, అదానీ విషయంలో ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలపై ప్రధాని ఒక్క మాటకూడా మాట్లాడలేదు.
సభ అనంతరం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని ప్రసంగంపై విమర్శలు గుర్పించారు. మోదీ తన మిత్రుడిని (అదానీని) కాపాడుతున్నారని, ఇది ప్రధాని ప్రసంగంతో నిజమైందన్నారు.
I asked very simple questions but Modi didn’t show any guys to answer anyone of them.
– Rahul Gandhi Ji pic.twitter.com/1YuFFN3B09
— Shantanu (@shaandelhite) February 8, 2023
ఒక వేళ మిత్రుడు (అదానీ) కాకపోతే పూర్తి విచారణ చేయిస్తామని చెప్పి ఉండాల్సి ఉందన్నారు. మోదీ ప్రసంగం తనకు సంతృప్తినివ్వలేదని, అదానీని ప్రధాని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన (అదానీ) షెల్ కంపెనీ, బినామీ ఆస్తులపై విచారణకు డిమాండ్ చేసినా పట్టించుకోలేదన్నారు.
ప్రధానికి గౌతం అదానీకి మధ్య స్నేహం లేకపోతే షెల్ కంపెనీల వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇద్దరూ దోస్తులని, అందుకే అతనికి ఏ సమస్య రాకుండా ప్రధాని మోదీ కాపాడుతున్నారని స్పష్టం అవుతుందన్నారు.
ఇది దేశ భద్రత, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశమని, విచారణ జరుపుతామని చెప్పాల్సిందన్నారు. ఇదో పెద్ద కుంభకోణమని, ఖచ్చితంగా అదానీని రక్షించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారన్నారు.
Rahul Gandhi and team shouting "Adani ! Adani ! Adani !" infront of Narendra Modi