విధాత, నల్గొండ జిల్లా పెద్ద అడిశర్ల మండలం చిలకమర్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు బైక్ ను ఢీకొనడంతో బైక్ దగ్ధమైంది. ప్రమాదంలో బైక్ పై వెళుతున్న తల్లి, కొడుకులు వెంకాయమ్మ, గణేష్ లు మృతి చెందారు.
మల్లేపల్లి వైపు నుండి సాగర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది మృతుల స్వస్థలం బాపట్ల జిల్లా అద్దంకిగా గుర్తించారు..వారు కొంతకాలంగా దేవరకొండ మండలం తాటికోల్ లో నివసిస్తున్నారు.