విధాత: కేసీఆర్ ఏ క్షణమైనా ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నదని, కాంగ్రెస్ పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్ ఠాక్రేతో చెప్పినట్టు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా ఠాక్రే గాంధీభవన్‌లో నేతలతో చర్చించారు. ఈ సందర్బంగా కోమటిరెడ్డి కూడా ఠాక్రేతో బేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 50-60 మంది అభ్యర్థులను ముందే ప్రకటించాలి.
వారం, పది రోజుల ముందు అభ్యర్థులను ప్రకటిస్తే ప్రయోజనం ఉండదన్నారు. కార్యకర్తలను పోరాటానికి సిద్దం చేయాలి. వచ్చే 6 నెలలు ప్రజా పోరాటాలు బలంగా చేయాలి.
గాంధీభవన్‌లో సమావేశాలు తగ్గించి ప్రజల్లో ఉండాలని చెప్పాను. జిల్లా సమావేశాలు పెట్టాలని ఠాక్రేకు సూచిస్తే ఒప్పుకున్నారని కోమటిరెడ్డి చెప్పారు.