Site icon vidhaatha

నా కుమారుడు ఎన్నికల్లో పోటీ చేస్తాడు: గుత్తా

విధాత, నా కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నాడని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమిత్ రెడ్డి పోటీపై పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని, అవకాశం లభిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తాడని తెలిపారు.

ఈనెల 14 వరకు బడ్జెట్ సమావేశాలు ఉండవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య నెలకొన్న వివాదంపై గుత్తా స్పందిస్తూ కేంద్రం చెప్పినట్లు గవర్నర్లు వ్యవహరిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు.

రాష్ట్ర బడ్జెట్ సందర్భంగా గవర్నర్ ప్రసంగం తమిళనాడు తరహాలో ఉండదని అనుకుంటున్నామన్నారు. తాను గవర్నర్ల వ్యవస్థకు మొదటి నుంచి వ్యతిరేక మన్నారు.

Exit mobile version