Site icon vidhaatha

గరికపాటి వారు ఏదో మూడ్‌లో అని ఉంటారు.. మెగా అభిమానులకు నాగబాబు విజ్ఞప్తి!

విధాత‌: గరికపాటి నరసింహారావు వివాదం చినికి చినికి గాలివానగా మారిన విషయం తెలిసిందే. అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో “చిరంజీవి గారు ఆ ఫొటో సెషన్‌ ఆపేసి వచ్చి కూర్చుంటేనే నేను మాట్లాడతాను. లేదంటే సెలవు ఇప్పించండి వెళ్లిపోతాను” అంటూ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత గరికపాటి నరసింహారావు ప్రవర్తించిన తీరుపై ప్రముఖుల నుంచి మెగా అభిమానుల వరకు అంతా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గరికపాటి నరసింహారావు- మెగాస్టార్ చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ సోషల్‌ మీడియా వేదికగా డిమాండ్‌ చేశారు.

ఉత్తేజ్‌లాంటి వారు అయితే గరికపాటికి ఓపెన్‌ లెటర్‌ కూడా రాశారు. మీరు అలా ప్రవర్తించి ఉండ కూడదంటూ సున్నింతగా చెప్పుకొచ్చారు. ఈ ఘటన జరిగిన తర్వాత మెగా బ్రదర్‌ నాగబాబు సైతం స్పందించారు. “ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే” అంటూ నాగబాబు సైతం పరోక్షంగా కౌంటర్‌ వేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మెగా అభిమానులు ఈ వివాదంపై తీవ్రంగా స్పందించారు.

ఈ విషయంపై స్పందించిన గరికపాటి.. వివాదంపై నేను చిరంజీవితో మాట్లాడతాను అంటూ చెప్పుకొచ్చారు. కానీ, అభిమానులు మాత్రం.. ఎలాగైనా గరికపాటి నరసింహారావు చిరంజీవికి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు.

ఈ వివాదం కాస్త ఉద్ధృతం అవుతున్న నేపథ్యంలో ఈ విషయంలో మళ్లీ మెగా బ్రదర్‌ నాగబాబు కలగ జేసుకున్నారు. ఎవరూ తొందరపడకండి అంటూ ఫ్యాన్స్‌ కు నాగబాబు సూచన చేశారు. ఫ్యాన్స్ కూడా గరికపాటి నరసింహారావు గురించి సోషల్ మీడియా వేదికా తప్పుగా మాట్లాడవద్దంటూ విజ్ఞప్తి చేశారు. మరి.. నాగబాబు కలగజేసుకుని చేసిన సూచనను మెగా అభిమానులు అర్థం చేసుకుని ఈ వివాదానికి ముగింపు పలుకుతారని ఆకాంక్షిస్తున్నారు.

Exit mobile version