Site icon vidhaatha

మొత్తానికి వివాహం చేసుకోబోతున్న సీనియర్ నరేష్- పవిత్ర లోకేష్..!

విధాత: సీనియర్ నరేష్.. ‘సీనియర్‌ నటి విజయనిర్మల మొదటి భర్తకు కలిగిన కుమారుడు. ఈయన 1972లో పండంటి కాపురం అనే చిత్రం ద్వారా బాలనటునిగా సినీరంగ ప్రవేశం చేశాడు. ఇతని తల్లి విజయనిర్మల దర్శకత్వంలో ప్రేమ సంకెళ్లు చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత నాలుగు స్తంభాలాట, శ్రీవారికి ప్రేమలేఖ, చిత్రం భళారే విచిత్రం, జంబలకడిపంబ వంటి హాస్య చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

అయితే నరేష్ ఎప్పుడు వివాదాస్పదంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ ఎన్నికల్లో శివాజీ రాజా మీద గెలుపొందాడు. తర్వాత ఇటీవల మంచు విష్ణు నిలబడ్డప్పుడు ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇక ఈయనకు ఇప్పటివరకు మూడు వివాహాలు జరిగాయి.

మొదటిగా సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు నవీన్ జన్మించాడు. అదే నవీన్ బాబును ఇటీవల ఓ చిత్రంతో హీరోగా పరిచయం చేశాడు. ఆ తర్వాత ఆమెతో మనస్పర్ధల కారణంగా విడిపోయి రెండో పెళ్లి చేసుకోగా ఆమెతోను విడాకులు చేసుకున్నారు.

Exit mobile version