విధాత: ప్రతి విషయానికీ రెండు కోణాలుంటాయి.. అవి విభిన్నంగా ఉంటాయి. నాణానికి బొమ్మా బొరుసు ఉన్నట్టే ప్రతి విషయంలోనూ రెండు విభిన్నమైన కోణాలు ఉంటాయి. ఆ రెండు కోణాలూ తెలిసిన వారు మాత్రమే ఏది నిజం ఏది అబద్దం అనేది తేల్చగలరు. ఒక వ్యక్తి వాదనలు విని ఏ విషయాన్నిజడ్జ్ చేయలేం. ఎదుటివారి వాదన కూడా వినాల్సి ఉంటుంది. ఇక ఇటీవల నటి కరాటే కళ్యాణి ఎంత దారుణంగా తనను తన భర్త హింసించేవాడో చెప్పుకొచ్చింది. మరో వివాహం చేసుకోవాలని ఉందని ప్రకటించింది.
కాగా ఈ మధ్యనే సీనియర్ నరేష్‌పై ఆయన మూడో భార్య రమ్య రఘుపతి సంచలన ఆరోపణలు చేసింది. తనను వదిలించుకోవడానికి నరేష్ ఎన్నో దారుణాలు చేశాడని తెలిపింది. చివరకు దేవుడులాంటి కృష్ణకు తనకు అక్రమ సంబంధం అంటగట్టాడని వాపోయింది. తండ్రి లాంటి కృష్ణకు నాతో అక్రమ సంబంధం అనేది భరించలేక పోయాను.. కానీ కృష్ణగారి ఫ్యామిలీ గౌరవాన్ని కాపాడడం కోసం తాను మౌనంగా ఉన్నానని చెప్పింది. నా వలన ప్రాణహాని ఉందని ఒక ఫేక్ లెటర్ సృష్టించి దానిమీద కృష్ణ కంప్లైంట్ చేస్తున్నట్టుగా ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపించింది.
ఇది మామూలు ఆరోపణ కాదు. ఇండస్ట్రీలో ఎంతో పేరున్న సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి సంబంధించిన విషయం. ఈ విషయాలను ఆమె విజయనిర్మల, కృష్ణలు బతికుండగా చెప్పకుండా ఇప్పుడు వాటిని బయటకు తీయడం విచిత్రమైనదిగా భావించాలి.
అయితే ఇక్కడ ఒక విషయం అర్ధమవుతోంది. నరేష్ తాను పవిత్ర లోకేష్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు విజయనిర్మల, కృష్ణ బతికున్నంత వరకు చెప్పలేదు. నాకు వివాహం మీద నమ్మకం లేదు. మేము సహ జీవనం చేస్తున్నాము. పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పుకొచ్చాడు. కానీ వారు చనిపోయిన వెంటనే ఆయన నాలుగో వివాహాన్ని ప్రకటించాడు. ఇందులో ఏదో మతలబు ఉన్నట్లుగా అందరికీ అనిపిస్తోంది.
రమ్య కుటుంబం కూడా చిన్నదేమీ కాదు. కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె ఆమె. సీనియర్ నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇప్పుడు నాలుగో వివాహానికి సిద్ధమయ్యాడు. పవిత్ర లోకేష్‌ను వివాహం చేసుకుంటాను అంటున్నాడు. ఒకరితో విభేదాలు అంటే సరే ఏకంగా ముగ్గురితో వివాహ బంధాలు విబేధాల వల్ల ఎలా నాశనం అవుతాయి? నరేష్ ప్రవర్తనపై అనుమానం వస్తుంది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం మరో మలుపు తీసుకుంది.
సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పూజిత.. నరేష్ చాలా మంచివాడని కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చింది.. ఒకసారి నరేష్ తనను ఆదుకున్నాడని ఆమె తెలిపింది. అందులో మా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నరేష్ ఎందరికో సాయం చేశాడని ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని పేర్కొంది. ఇక తాను సాయం అడిగిన సమయంలో మా అధ్యక్షుడిగా ఉన్న రాజేంద్రప్రసాద్ తనకు సాయం చేయలేదని ఆరోపించింది. రాజేంద్ర ప్రసాద్ నేను ఒకేసారి ఈసీ మెంబర్స్‌గా ఉన్నామని తనతో ఎన్నో చిత్రాల్లో నటించిన రాజేంద్ర ప్రసాద్ తను ఎవరో తెలియనట్లు ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది.
నరేష్ చాలా మంచివాడని కానీ అతడు ఒక నెత్తిమీద శని పెట్టుకున్నాడని తెలిపింది. ఇంతకీ ఆ శని ఎవరు అంటే సమాధానం లేదు. బహుశా అది నరేష్ పై ఆరోపణలు చేసిన రమ్య అయి ఉండవచ్చు. అయినా తనకు సాయం చేసినంత మాత్రాన సీనియర్ నరేష్ మంచివాడై పోతాడా అనేది అసలు ప్రశ్న. కొందరు ఆడవారికి సహాయం చేస్తూ ఉంటారు. కానీ మగవారు అడిగితే మాత్రం సాయం చేయరు. ఆపదలో ఉన్నారని తెలిసినా ఆదుకోరు. ఆడవాళ్లయితే మాత్రం పాపం ఆడవారు అంటూ సాయం చేస్తారు. అంటే వారు సాయం చేసే విధానంలో ఎక్కడో చెడు అభిప్రాయం ఉంటుంది.
కేవలం పూజితకు సాయం చేసినంత మాత్రాన నరేష్ గొప్పవాడు కాలేడు. ఎందుకంటే మా ఎలక్షన్లలో అతను ఏ రేంజ్‌లో తన ప్రావీణ్యం చూపించాడో అందరికీ తెలుసు. మొత్తానికి ఇది కృష్ణ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసే విధంగా ఉంది. కృష్ణని అందునా మరణించిన తర్వాత ఇలా వివాదాలలోకి లాగడం చాలా బాధాకరం. దీనికి సరైన సమాధానం చెప్పగలిగే వారు రావాలి.
ఈ విషయంలో నరేష్ గురించి రమ్య గురించి పూర్తిగా తెలిసిన వారు వచ్చి తప్పు ఒప్పులను బయటకు చెబితే గాని అసలు విషయం బయటకు రాదు. లేదా ఈ వివాదాన్ని మరింత పెద్దది కాకుండా చేయాలి. కానీ రమ్య మాత్రం నరేష్‌కు విడాకులు ఇవ్వను అంటుంది. తన కుమారుడు తన తండ్రి కావాలని కోరుతున్నాడు అని చెబుతోంది. మొత్తానికి ఇది తొండ ముదిరి ఊసరవెల్లి మారినట్టుగా ట్రయాంగిల్ స్టోరీగా బలపడుతోంది.