Site icon vidhaatha

ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డికి జాతీయ మహిళా కమిషన్‌ నోటీసులు

విధాత, హైదరాబాద్‌: ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డికి జాతీయ మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న కమిషన్‌ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశించింది. ఈ నెల 14న జాతీయ మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది.

గవర్నర్‌ తమిళిసై పట్ల పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేసినందుకు నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. గత నెలలో జమ్మికుంటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తమిళిసైని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీ, శాసనమండలి ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా ఇప్పటిదాకా దాచుకున్నారంటూ అనుచిత పదజాలాన్ని వినియోగించారు. ఓ మహిళా గవర్నర్ అని చూడకుండా మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో తాజాగా మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

Exit mobile version