NEET Results
NEET Results | నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్ టెస్ట్ నీట్-2023 ఫలితాలను విడుదల చేసింది.
ఫలితాల్లో తమిళనాడుకు చెందిన జే ప్రబంజన్, ఏపీకి చెందిన బోరా వరుణ్ చక్రవర్తి 99.99 పర్సంటైల్‌తో నీట్‌లో అగ్రస్థానంలో నిలిచారు. తెలంగాణకు చెందిన విద్యార్థి కేజీ రఘురాంరెడ్డికి 15వ ర్యాంకు దక్కింది.
ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో ఏపీ విద్యార్థి వైఎల్ ప్రవధాన్ రెడ్డి తొలి ర్యాంకును సాధించాడు. ఎస్సీ కేటగిరిలో ఏపీ విద్యార్థి కే యశశ్రీకి రెండో ర్యాంకు దక్కింది.
నీట్‌కు ఈ ఏడాది 20.38లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా ఇందులో 11,45,976 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ నుంచి 42,654 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఏపీ నుంచి 42,836 మంది ఉత్తీర్ణులయ్యారు.