Site icon vidhaatha

BJP.. నయా ఔరంగజేబ్‌!

విధాత: ప్రధాని నరేంద్రమోదీ (Pm Narendra Modi) నేతృత్వంలోని బీజేపీ (BJP) నయా ఔరంగజేబ్‌ (New Aurangzeb)లా మారిపోయిందా? ఇందుకు ఈ కింది అంశాలను పరిశీలించాలనే అభిప్రాయాలు మేధావివర్గం నుంచి వినిపిస్తున్నాయి.

బీజేపీ అనుసరిస్తున్న విధానాలు, బడా కార్పొరేట్‌ కంపెనీ (corporate company)లకు లబ్ధి చేకురుస్తూ సాధారణ ప్రజలను ఇబ్బంది పెడుతున్న తీరు.. ప్రజాస్వామిక విలువలను గాలికి వదిలేయడం వంటివి గమనిస్తే.. బీజేపీ.. అచ్చం ఔరంగజేబ్‌ను తలపిస్తున్నదని అంటున్నారు.

1. ప్రజాస్వామ్య విలువలను గాలికి వదిలి రాజుల కాలం నాటి పోకిరి రాజకీయాలను అనుసరిస్తున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పక్షాలు అనుసరించే సభ్యతా సంస్కారాలు ఈ పార్టీలో మచ్చుకైనా కనిపించడం లేదు.

2. కార్పొరేట్‌ కంపెనీల కొమ్ము కాస్తూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది. ప్రజల సంక్షేమానికి పాటుపడే బదులు ప్రజల సొమ్మును దోచి వేస్తున్నది.

3. పచ్చి అబద్ధాలతో సమాజంలోని భిన్న వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నదే తప్ప పొరపాటున కూడా వాస్తవాలను చెప్పదు. సత్యాన్ని పలుకదు.

4. బీజేపీకి ఘనమైన చరిత్ర అంటూ చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ ఇతరుల చరిత్రను వక్రీకరిస్తూ, చరిత్రను హననం చేస్తూ, విద్వేష ప్రచారాలు సాగిస్తున్నది.

5. బీజేపీకి ఉన్నదే పరమ చెత్త నాయకులు. వీరు చేసే పని- ఇతర పార్టీల నాయకులపై చెత్త కుమ్మరించడం.

6. బీజేపీకి తమకంటూ గొప్ప విధానాలు, సిద్ధాంతాలు ఏమీ లేవు. అందుకే ఇతర పార్టీల విధానాలు, సిద్ధాంతాలను వక్రీకరిస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నది.

7. బీజేపీ అనుసరించే నిబంధనావళి అంటూ ఏమీ లేదు. నియమాలను ఉల్లంఘించడమే ఈ పార్టీ నియమంగా మారింది.

8. ఎంతో గొప్ప చరిత్ర, సంస్కృతి, ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ అంటే బీజేపీకి ఏ మాత్రం గిట్టదు. ఎన్నో సార్లు తెలంగాణ పట్ల బీజేపీ పెద్దలు విషం కక్కారు. తెలంగాణ గొప్పతనాన్ని ఈ పార్టీ జీర్ణించుకోలేదు.

9. మొరటుతనం, తలబిరుసుతనం, నిరంకుశత్వం బీజేపీ సహజ లక్షణాలు. దురాక్రమణదారు స్వభావం గలదనే అనేకసార్లు వెల్లడించుకున్నది. చట్టాలను, న్యాయాన్ని ఉల్లంఘిస్తూ, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నది. రాజకీయ ప్రత్యర్థులను నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది.

10. బీజేపీ అంటెనే కుంభకోణాలకు పుట్టినిల్లు. అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం తాండవిస్తున్నాయి. చట్టబద్ధ పాలన చట్టుబండలై పోయింది. మోసం, దగా మొదలైన అవలక్షణాలతో రాజకీయాలను నడుపుతున్నది.

బీజేపీని సహిస్తే సర్వనాశనమేనని, ఔరంగ జేబు కాలం నాటికి దేశాన్ని వెనుకకు నెట్టడమేనని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.

Exit mobile version