Site icon vidhaatha

సామ్‌సంగ్‌ ఎస్‌24 లాంచ్‌ డేట్‌ వచ్చేసింది..! ఫోన్‌ ఫీచర్స్‌, ధర తెలుసా..?

విధాత‌: స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌. గతకొంతకాలంగా ఎదురుచూస్తున్న సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌24 సిరీస్‌ మొబైల్‌ లాంచ్‌ డేట్‌ వచ్చేసింది. వచ్చే ఏడాది జనవరి 17న అంతర్జాతీయ మార్కెట్‌లోకి రానున్నది. ఈ సిరీస్‌లో సామ్‌సంగ్‌ ఎస్​24, ఎస్​24ప్లస్‌, ఎస్​24 అల్ట్రా గ్యాడ్జెట్స్​​ ఉండనున్నాయి. జనవరి 17న మార్కెట్‌లోకి వస్తుండగా.. 18వ తేదీ నుంచి ప్రీ బుకింగ్స్‌ మొదలవనున్నాయి. అదే నెల 26 నుంచి ఫోన్ల డెలివరీ మొదలవుతుంది.


ఫోన్‌ ఫీచర్స్‌ ఇవే..


సామ్​సంగ్​ గెలాక్సీ ఎస్​24, ఎస్​24 ప్లస్‌ మోడల్‌ ఫోన్లలో ఫుల్​ హెచ్​డీ ప్లస్‌ అమోలెడ్​ ఎల్​టీపీఓ డిస్​ప్లేతో వస్తుంది. 12జీబీ ర్యామ్​- 512జీబీ స్టోరేజ్​ ఉండే అవకాశం ఉంది. స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 3, లేదంటే ఎక్సినోస్​ 2400 చిప్​సెట్​తో వచ్చే అవకాశాలున్నాయి. రెండు మోడల్స్‌లో 50ఎంపీ ప్రైమరీ, 12ఎంపీ సెకెండరీ, 10ఎంపీ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుందని టాక్‌.


సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 12ఎంపీ ఫ్రెంట్​ కెమెరా సెటప్‌ ఉండబోతుందని తెలుస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత వన్​యూఐ6 సాఫ్ట్​వేర్​పై ఈ మోడల్స్​ పని చేయనున్నాయి. సామ్​సంగ్​ గెలాక్సీ ఎస్​24 అల్ట్రాలో టిటానియమ్​ ఫ్రేమ్​ ఉండబోతుందని తెలుస్తుంది. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 3 ప్రాసెసర్​ వస్తుందని, 200ఎంపీతో కూడిన ట్రిపుల్​ రియర్‌ కెమెరా, సెల్ఫీ కోసం 12ఎంపీ కెమెరా సెటప్‌ ఉండబోతుంది.


ధర ఎలా ఉండబోతుందంటే..?


సామ్‌సాంగ్‌ ఎస్‌ 24 సిరీస్‌ మోడల్స్‌ జనవరి 17న కాలిఫోర్నియా వేదికగా జరిగే ఈ వెంట్‌లో లాంచ్‌ కానున్నాయి. ప్రస్తుతం ఈ మూడు మోడల్స్‌కు సంబంధించిన ధరలపై ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే, ఎస్‌24 రూ.75వేలు, ఎస్‌24 ప్లస్‌ రూ. 83,500, అల్ట్రా మోడల్‌ రూ.1.1లక్షల దాకా ఉండొచ్చని టాక్‌.


అదే సమయంలో సామ్‌సంగ్‌ సరికొత్త మిడ్‌రేంజ్‌ ఫోన్‌ను సైతం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది. గెలాక్సీ ఎస్‌25గా పేరు పెట్టగా.. ఇది 5జీ ఫోన్‌. ఈ మోడల్‌కు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యాయి. ఏ25లో ఎక్సినోస్​ 1280 చిప్​సెట్​, 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా-వైడ్​, 2ఎంపీ మాక్రో లెన్స్‌తో కూడిన ట్రిపుల్‌ రియర్‌ సెటప్‌ ఉండనున్నది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 13ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, వాటర్​ డ్రాప్​ స్టైల్​ డిజైన్​తో కూడిన 6.5 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ ప్లస్‌ డిస్​ప్లేతో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

Exit mobile version