Nirmal | BRSకు షాక్‌.. హస్తం గూటికి KTR సన్నిహితుడు శ్రీహరిరావు..?

విధాత ప్రతినిధి ఉమ్మడి అదిలాబాద్: నిర్మల్ (Nirmal ) జిల్లా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీహరి రావు కారు దిగి హస్తము గూటిలోకి వెళ్లడానికి టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్‌లో తన నివాసంలో TRS పార్టీ అసమ్మతి నేతలతో సమావేశం ఏర్పాటు చేసుకొని సలహాలు సూచనలు తీసుకున్నాడు. ఈ మేరకు ఆయన టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ కు పంపినట్టు సమాచారం. […]

  • Publish Date - June 13, 2023 / 03:42 AM IST

విధాత ప్రతినిధి ఉమ్మడి అదిలాబాద్: నిర్మల్ (Nirmal ) జిల్లా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీహరి రావు కారు దిగి హస్తము గూటిలోకి వెళ్లడానికి టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్‌లో తన నివాసంలో TRS పార్టీ అసమ్మతి నేతలతో సమావేశం ఏర్పాటు చేసుకొని సలహాలు సూచనలు తీసుకున్నాడు. ఈ మేరకు ఆయన టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ కు పంపినట్టు సమాచారం.

ఉద్యమ సమయంలో శ్రీహరి రావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. నిర్మల్ నియోజవర్గం నుంచి శ్రీహరి రావు 2009లో, 2014లో టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. గత రెండు నెలల నుండి పార్టీ అధినాయకత్వంపై తన గళం విప్పాడు.

పార్టీలో నకిలీ ఉద్యమ నాయకులు ఉన్నత పదవులలో కొనసాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు . గతంలో టిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలలో సైతం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పనితీరుపై అసహనం వ్యక్తం చేశాడు. సీఎం కేసీఆర్ నిర్మల్ జిల్లా పర్యటనలో భాగంగా పార్టీ సమావేశాలకు, బహిరంగ సభకు దూరంగా ఉన్నాడు.

సీఎం కేసీఆర్‌కు కేటీఆర్‌కు సన్నిహితుడిగా పేరు ఉన్న శ్రీహరి రావు పార్టీకి రాజీనామా చేయడం కలకలం లేపుతుంది. గత నెల రోజుల క్రితం నిర్మల్ జిల్లా సారంగాపూర్ ZPTC రాజేశ్వర్ రెడ్డి TRS పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు.

ఈ నేపథ్యంలో మరో బీఆర్ఎస్ నేత శ్రీహరి రావు ఈనెల 17న కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి ముహూర్తం ఖరారు అయిందని సమాచారం. టీఆర్ఎస్ పార్టీ వీడి మరి కొంతమంది కాంగ్రెస్‌లోకి పోయే అవకాశాలున్నాయని ప్రచారం కొనసాగుతుంది.