Site icon vidhaatha

విజయ్ దేవరకొండ: యాటిట్యూడ్‌లో ఏం మార్పు లేదబ్బా..

విధాత‌: తెలుగులో ఉన్న అతి కొద్ది మంది కొత్తతరం స్టార్‌లలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పేరును ప్రముఖంగా చెప్పుకోవాలి. ఆయన తన చిత్రాల ద్వారానే కాదు తనదైన యాటిట్యూడ్, మాట తీరు, మాట్లాడే మాటలు, వాడే బూతులు ఇలా ప్రతిదీ ఒక వివాదమే.

ఆయన వేసుకునే డ్రెస్సులు, ఆయన బిహేవియర్, మీడియా ముందు ఆయన కూర్చునే తీరు, మాట్లాడే విధానం, సమాధానాలు చెప్పే పద్ధతి, అన్ని.. అయితే నాకేంటి అన్నట్టుగా ఉంటాయి. గతేడాది ఆయనకు చేదు అనుభవాలనే మిగిల్చింది. ఎన్నో అంచనాల మధ్య పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తూ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ‘లైగర్’ చిత్రం డిజాస్టర్ అయ్యింది.

ఈ మూవీపై ఏర్ప‌డిన అంచ‌నాలు, చిత్రానికి ఉన్న బ‌జ్ చూసి బ‌య్య‌ర్లు భారీ మొత్తాల‌కు కొన్నారు. దాంతో బయ్యర్లు పెద్ద మొత్తంలో నష్టపోయారు. డిజిట‌ల్, శాటిలైట్ హ‌క్కులు కూడా భారీ ధ‌రే ప‌లికాయి. ఇక బ‌య్య‌ర్ల‌కు పూరికి మధ్య వివాదం కూడా నడిచింది. ఒకవైపు ఫెయిల్యూర్ బాధ‌.. మరోవైపు వివాదాలు ఇది దేవరకొండ పరిస్థితి.

‘లైగర్‌’ మూవీ బడ్జెట్ సమీకరణ, బిజినెస్ వ్యవహారాలలో ఆర్థిక నేరాలు జరిగాయనే ఆరోప‌ణ‌ల‌పై దర్శకుడు పూరి, నిర్మాత చార్మిలతో పాటు హీరో విజయ్ దేవరకొండను కూడా ఈడి అధికారులు విచారించారు. విజయ్ దేవరకొండను దాదాపు 11 గంటలపాటు వారు విచారించి పలు ప్రశ్నలు అడిగారు. ఈ సినిమాకు నీ రెమ్యూనేషన్ ఎంత? అది ఏ రూపంలో ఇచ్చారు? అనే కోణంలో ప్రశ్నించారు.

లైగ‌ర్ మూవీపై ఉన్న నమ్మకంతో.. ఆ వెంటనే పూరి జగన్నాథ్‌తో మరో చిత్రానికి విజయ్ దేవరకొండ కమిట్ అయ్యాడు. జనగణమన అనే చిత్రం అది. కానీ లైగర్ ఫ‌లితం చూసిన త‌ర్వాత విజయ్ దానిని పక్కన పెట్టేశాడు.. ఇక ప్రస్తుతం ఆయ‌న ఖుషీ అనే చిత్రంలో నటిస్తున్నాడు..

చిత్రీకరణ మొదలైనప్పటికీ ఇందులో హీరోయిన్ అయిన సమంతకు వ‌రుస‌ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒకవైపు నాగచైతన్యతో విడాకులు… మరోవైపు ప్రాణాంతకమైన మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతుండ‌టంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. మరలా ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేదు.

ప్రస్తుతం ఈ చిత్రం ఉంటుందా లేదా అనేది సమంత చేతుల్లోనే ఉంది. అంతేగాని విజయ్ దేవరకొండ చేయగలిగింది ఏమీ లేదు. ఇంకా సుకుమార్‌తో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సినిమా ఉంటుందని అన్నారు. కానీ ఆ సినిమా కూడా అట్ట‌కెక్కినట్టు సమాచారం.

సుకుమార్ వ‌రుస చిత్రాల‌తో చాలా బిజీ. దాంతో ఆయన విజయ్ దేవరకొండ తో ప్రాజెక్టును పక్కన పెట్టేసాడని అంటున్నారు. ఇలాంటి సమయంలో విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరితో ఓ చిత్రం చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.

ఇక తాజా విషయానికి వస్తే విజయ్ దేవరకొండ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను చాలా బాగా జరుపుకున్నాడు. ఆయన మాల్దీవులకు వెళ్లినట్లుగా కనిపిస్తున్నాడు. స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ షాంపేన్ తాగుతూ ఫోటోలు తీశాడు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

దాంతో పాటు ఆయన ముగిసిన ప్రతి ఏడాదిలో విజయాలు, అపజయాలు, నవ్వులు, ఏడుపులు అన్నీ ఉంటాయి. ఏదేమైనా సెలబ్రేట్ చేసుకోవడమే…. అంటూ తనదైన యాటిట్యూడ్‌ను మరోసారి తెలిపారు విజయ్ దేవరకొండ అలియాస్ రౌడీ స్టార్.

Exit mobile version