విధాత: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో సెయింట్ ఫ్రాన్సిస్, స్టాన్లీ, లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో అదనపు సమయం ఇచ్చారని వచ్చిన ఆరోపణలపై కలెక్టర్ వివరణ ఇచ్చారు.
పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. ఇన్విజిలేటర్లు తెలుగు..ఇంగ్లిష్‌లో ముద్రించిన ప్రశ్నపత్రానికి బదులు మరొకటి ఇచ్చారని తెలిపారు.
గందరగోళం వల్ల అభ్యర్థులు నష్టపోయిన సమయాన్నిఅదనంగా ఇచ్చామన్నారు. ఇన్విజిలేటర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.