2023లో భూమిపై మిలియన్ల మరణాలు? నోస్ట్రడామస్ ఉమెన్ భవిష్యవాణి!

Nostradamus: భవిష్యత్తు ఎప్పుడూ ఆసక్తి కరమే. కొత్త ఏడాది వస్తోందంటే అది మరింత పెరుగుతుంది. వచ్చే ఏడాది ఎలా ఉంటుంది అనే విషయాలను గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది భవిష్యవాణి చెబుతుంటారు అలాంటి వారిలో ఒకరు నోస్ట్రడామస్ ఉమెన్ గా ప్రఖ్యాతి గాంచిన బల్గేరియన్ బాబా వంగా. ఆమె 5079 నాటికి ప్రపంచం కచ్చితంగా ముగింపుకు వచ్చేస్తుందని చెబుతున్నారు. 2023 లో ప్రపంచం లో చాలా పెద్ద మర్పులు […]

  • Publish Date - December 4, 2022 / 02:14 PM IST

Nostradamus: భవిష్యత్తు ఎప్పుడూ ఆసక్తి కరమే. కొత్త ఏడాది వస్తోందంటే అది మరింత పెరుగుతుంది. వచ్చే ఏడాది ఎలా ఉంటుంది అనే విషయాలను గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది భవిష్యవాణి చెబుతుంటారు అలాంటి వారిలో ఒకరు నోస్ట్రడామస్ ఉమెన్ గా ప్రఖ్యాతి గాంచిన బల్గేరియన్ బాబా వంగా.

ఆమె 5079 నాటికి ప్రపంచం కచ్చితంగా ముగింపుకు వచ్చేస్తుందని చెబుతున్నారు. 2023 లో ప్రపంచం లో చాలా పెద్ద మర్పులు జరుగుతాయని అంచనా వేసి చెబుతున్నారు. ఆమె చెప్పిన విషయాలు టూకీగా మీకోసం..

భూమి మీద జరిగే ఒక విస్ఫోటనం వల్ల భూమి కక్ష్య మారుతుందట. సౌర తుఫాను వల్ల రేడియేషన్ కూడా తారా స్థాయికి పెరుగుతుందని, వైజ్ఞానిక ఆవిష్కరణలలో ప్రయోగశాలల్లో నుంచి ఆవిర్భవించే పిల్లలు అనేది ఒక చిన్న విషయం మాత్రమే అని అమె అబిప్రాయపడుతున్నారు. వారిలో నుంచే 2023లో శత్రు గ్రహాల నుంచి వచ్చే జీవులు కనిపిస్తారని, ఫలితంగా భూమి మీద మిలియన్ల మరణాలు జరుగుతాయని చాలా భయంకరమైన భవిష్య వాణి చెబుతున్నారు.

  • సూపర్ జీవ ఆయుధాల గురించి ప్రస్తావిస్తూ ఉక్రెయిన్, రష్యా మధ్య సంక్షోభం వల్ల ఈ విషయం మరుగున పడిపోతుంది అంటున్నారు.
  • భూమి చుట్టూ ఆవరించి ఉన్న మాగ్నటిక్ షీల్డ్ కు సునామీ, సౌర తుఫాను కారణంగా 2023లో చాలా నష్టం వాటిల్లుతుంది. ఏలియన్స్ దాడిలో భూమి మీద లక్షల్లో జనాభా చనిపోతారు.
  • 2023లో భూకక్ష్యలో జరిగే మార్పు వల్ల భూమి, దాని కాస్మిక్ ఎనర్జీ మధ్య ఉండే అతి సున్నితమైన సమతౌల్యం దెబ్బ తింటుంది. చిన్న మార్పు కూడా పెద్ద మార్పులకు కారణం అవుతుంది.
  • ఫలితంగా భూవాతావరణంలో ఉష్ణోగ్రతలు చాలా పెరిగిపోవచ్చు. పరిస్థితి ఆందోళనకరంగా కూడా మారొచ్చు.
  • ప్రయోగశాలల్లో మనుషులను తయారు చేస్తారట. 2023 నాటికి తల్లి దండ్రులు తమ పిల్లలు ఏలా ఉండాలో నిర్ణయించుకుని ఎంపిక చేసుకుని కనే అవకాశం ఉంటుంది. దీంతో సరోగసి సమస్య అంతం అవుతుంది. దీని ప్రకారం ప్యూచర్‌లో పిల్లలు ల్యాబ్‌ల్లో మాత్రమే పుడతారట.
  • ఒక పవర్ ప్లాంట్ పేలి విషపూరిత మేఘాలు ఆసియా ఖండం మొత్తాన్ని దట్టమైన పొగ మేఘాలు కప్పేస్తాయి. ఫలితంగా తీవ్రమైన అంటువ్యాధులు ప్రబలి దేశదేశాలకు వ్యాపిస్తాయట.

ఇలా చాలా భయం కలిగించే విషయాలను గురించి ఆమె వివరించారు మరి అవి ఎంత వరకు జరుగుతాయో లేదో వేచి చూడాల్సిందే.