విధాత: ఎప్పటి నుంచో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఓ ఆరోపణ ఉంది. తన మామగారైన లెజెండ్ నందమూరి తారక రామారావుకి వెన్నుపోటు పొడిచి తెలుగు దేశం పార్టీ పగ్గాలు చేపట్టాడనేలా.. ఇప్పటికీ ఏదో ఒక చోట వినబడుతూనే ఉంటుంది. ఈ ఆరోపణలపై చంద్రబాబు నాయుడు కానీ, నందమూరి ఫ్యామిలీ కానీ ఇంత వరకు ఎక్కడా స్పందించలేదు.
కానీ ఫస్ట్ టైమ్ ఈ ఆరోపణలపై వివరణ ఇచ్చేలా చేసింది బాలయ్య హోస్ట్‌గా చేస్తున్న టాక్ షో. నందమూరి నటసింహం బాలయ్య హోస్ట్‌గా ఆహా ఓటీటీలో ‘ఆన్‌స్టాపబుల్’ అనే షో విజయవంతంగా రెండో సీజన్‌కి చేరుకుంది. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్‌కి చంద్రబాబు గెస్ట్‌గా వచ్చారు. షో మధ్యలో చంద్రబాబుకు ‘బిగ్ డెసిషన్’ అనే కార్డు పడింది. లైఫ్‌లో మీరు తీసుకున్న బిగ్ డెసిషన్ ఏమిటో చెప్పాలని బాలయ్య కోరగా..
చంద్రబాబు సమాధానమిస్తూ.. ‘‘1995 డెసిషన్’’ అని చెప్పారు. అంతా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆ సమయంలో అనేక హామీలతో అధికారంలోకి వచ్చాం. అయితే.. అంతకు ముందే ఫ్యామిలీలో సమస్యలు మొదలయ్యాయి. పార్టీ పరంగా ఎమ్మెల్యేలంతా తిరుగుబాటు మొదలెట్టారు. నేను, హరికృష్ణగారు, మీరు మొత్తం ఐదుగురు ఈ నిర్ణయం వెనుక సాక్ష్యంగా ఉన్నాం. ఐదుగురం కలిసి ఒకరోజు ఎన్టీఆర్‌ను కలవడానికి వెళ్లాం. మేం వచ్చామని తెలుసుకుని.. ఫ్యామిలీ గురించి మాట్లాడాలా? రాజకీయాలపై మాట్లాడాలా? అని పెద్దాయన అడిగారు.
రాజకీయాల గురించి అయితే.. ఫ్యామిలీ సభ్యులు ఎవరూ రావద్దు. నువ్వు మాత్రమే రా అని చెప్పారు. అప్పుడు నాతో పాటు వచ్చిన వారిలో హరికృష్ణ, బాలకృష్ణ బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత 3 గంటలు చర్చించాము.. నేను చాలా సేపు రిక్వెస్ట్ చేశా. మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలకు ఒక మాట చెప్పమని చెప్పా. చివరకు కాళ్లు కూడా పట్టుకుని అడుక్కున్నా. మీరు ఒక్క మీటింగ్ పెట్టి ధైర్యం ఇస్తే చాలు.. అన్ని సమస్యలు తీరిపోతాయండి అని చెప్పా. ఆయన వినలేదు. తర్వాత మీకు కూడా తెలిసిందే.
రామాంజనేయ యుద్ధమే జరిగింది. రాముడు, ఆంజనేయుడి మధ్య ఎలా యుద్ధం జరిగిందో అలా మా మధ్య యుద్ధం మొదలైంది.. అది చరిత్ర. ఎన్టీఆర్‌తో ముందుకు వెళ్లాలనేది అందరి అభీష్టం. అయినా.. వ్యక్తికన్నా కూడా ఆయన సిద్ధాంతాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఫ్యామిలీ అంతా కూర్చుని ఓ డెసిషన్‌కి వచ్చాం. అప్పుడు ఆ సమయంలో మీరు(బాలకృష్ణ) కూడా అక్కడే ఉన్నారు కదా. ఆ సమయంలో మనం తీసుకున్న నిర్ణయం తప్పా? ఎక్కడో బయట నుంచి వచ్చిన ఒక వ్యక్తి డామినేషన్ ఆయనపై ఎక్కువైంది. ఆయన అడిగింది ఎప్పుడూ కాదనలేదు.