Site icon vidhaatha

ఫ్యాన్స్‌ను సంతోషపెట్టిన NTR..!

విధాత‌: ఈ రోజుల్లో సోషల్ మీడియా బాగా వ్యాప్తి చెందింది. దీని ద్వారా తమ అభిమాన హీరోకి సంబంధించిన సినిమా అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు అభిమానులు కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా సినిమా మేకర్స్ తమ సినిమాల అప్‌డేట్స్‌ని ప్రకటిస్తూ వస్తున్నారు.

అయితే గత కొంతకాలంగా ఎందుకో తెలియదు గానీ కొందరు మేకర్స్ తమ సినిమాల విషయాన్ని ఏమీ చెప్పకుండా దాస్తున్నారు. అప్‌డేట్స్‌ అంటూ ఇవ్వడం లేదు. దాంతో అభిమానుల్లో అసహనం పెరిగిపోతుంది. దానికి తోడు ఏ సినిమా ఎంత భాగం పూర్తయింది? ఎవరెవరు నటిస్తున్నారు? ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది? వంటి విషయాలు కూడా చెప్పకుండా గుప్పిట మూసి పెడుతున్నారు.

దీంతో ప‌లువురు మేక‌ర్స్ వ్య‌వహార‌శైలిపై చాలా మంది అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ అభిమానులను ఇబ్బందులకు గురి చేయకుండా ముందస్తుగా ప్రణాళిక ర‌చించుకున్నాడట. RRR సినిమా విడుద‌ల అవ్వకముందే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేష‌న్‌లో మూవీ ప్రకటన వచ్చింది.

దాంతో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన వెంటనే సినిమా ప్రారంభమవుతుందని అభిమానులు భావించారు. కానీ ఆచార్య డిజాస్టర్ కావడంతో ఎన్టీఆర్ కొర‌టాల శివ చిత్రం ఆలస్యం అయ్యింది. గత ఏడాది చివర్లో సినిమా అసలు ఉంటుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ దీని విషయంలో ఎన్టీఆర్ కొర‌టాల శివపై త‌న‌కున్న న‌మ్మ‌కం స‌డ‌ల‌లేద‌ని నిరూపిస్తూ ఆయ‌న‌తోనే త‌న త‌దుప‌రి చిత్రం చేయాల‌ని డిసైడ్ అయ్యారు.

ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వలన పూజా కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించ బోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పటికే సినిమా చాలా ఆలస్యమైంది. ఈ ఏడాదిలో ఎన్టీఆర్ సినిమా లేకుండా అయ్యింది. అందుకే మరీ ఆలస్యం కాకుండా ఎన్టీఆర్ మరో సినిమాను చేసుకునే విధంగా కొర‌టాల శివ ప్లాన్ చేసినట్టు సమాచారం.

ఎన్టీఆర్‌తో చేయబోయే ఈ సినిమాను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేశాడట. కొరటాల శివ ఎన్టీఆర్ అభిమానులకు చిరాకు తెప్పించకుండా రెగ్యులర్‌గా సినిమా అప్‌డేట్స్ ఇస్తూ వ‌స్తాడ‌ని అంటున్నారు. అభిమానులు అస‌హ‌నానికి గుర‌వ్వ‌కుండా ఉండేందుకే ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని స‌మాచారం.

ఇదివరకే ప్రకటించిన విడుద‌ల తేదీ అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ 5నే సినిమాలు విడుదల చేయ బోతున్నారు. స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్ సంతృప్తిక‌రంగా ఉన్నార‌ని స‌మాచారం. కొర‌టాల శివ ఈ చిత్రం ప్రీప్రొడక్ష‌న్ వ‌ర్క్‌ని కూడా జెట్ స్పీడ్‌తో పూర్తి చేస్తున్నారు. ఎన్టీఆర్ ఓకే అన్న వెంట‌నే హైద‌రాబాద్ శివారులో భారీ సెట్టింగ్ షూటింగ్ ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నారు.

ఫ్యాన్స్‌ని ఇబ్బంది పెట్టకుండా కొరటాల శివ అప్‌డేట్స్ విషయంలో మాత్రం మంచి నిర్ణ‌య‌మే తీసుకున్నాడ‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు ఫ్యాన్స్‌కి అప్‌డేట్స్ ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌య్యారనే వార్త యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల‌కు కాస్త ఊర‌ట‌నిచ్చే విష‌య‌మేన‌ని చెప్పాలి. ఎప్పటికప్పుడు సినిమా అప్‌డేట్స్ ఇవ్వాలని నిర్ణయించుకోవడం మాత్రం హ‌ర్ష‌ణీయ‌మేన‌ని ప్రేక్ష‌కులు, అభిమానులు సంతోషంగా ఉన్నార‌ట‌.

Exit mobile version