OnePlus Ace2 Pro |
ప్రముఖ మొబైల్ బ్రాండ్ వన్‌ప్లస్ నుంచి మరోస్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి రాబోతున్నది. కొత్త మోడల్ పొరుగుదేశమైనా చైనాలో లాంచ్ అయ్యింది. వన్‌ప్లస్ ఏస్-2 ప్రో మోడల్ మొబైల్‌ను లాంచ్ చేయగా.. ఇది గతేడాది విడుదలైన ఏఎస్ ప్రో మొబైల్‌కు సక్సెసర్. ఈ నెల 23 నుంచి చైనాలోని ఆన్‌లైన్ స్టోర్స్‌లో అందుబాటులో ఉండనున్నది.
ఫీచర్స్ ఇవే..
వన్‌ప్లస్ ఏస్2 ప్రో కొత్త మోడల్‌లో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7 ఇంచ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఇచ్చింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్సెట్ ఉంటుంది. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ఫీచర్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 13 ఆధారిత కలర్ఓఎస్ సాఫ్ట్‌వేర్‌పై మొబైల్ పని చేస్తుండగా.. ఇందులో 5వేల ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 150వాట్ సూపర్‌వీఓఓసీ ఫాస్ట్ వయర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుండం హైలైట్‌గా నిలుస్తున్నది.
రియర్‌లో 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా వైడ్, 2ఎంపీ మైక్రో కెమెరాలుంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్‌లో 16 ఎంపీ కెమెరా ఉన్నది. యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్సీ, జీఎన్ఎస్ఎస్, బ్లూటూత్ 5.3, వైఫై 7, డ్యూయెల్ సిమ్ వంటి కెనెక్టివిటీ తదితర ఫీచర్స్ సైతం ఈ వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో మోడల్‌లో ఉన్నాయి. ఇన్ స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, డాల్బీ అట్మాస్, డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్, ఐఆర్ బ్లాస్టర్ ఫీచర్స్ ఇస్తున్నది. ఇక అరోరా గ్రీన్, టైటానియం యాష్ గ్రే రంగుల్లో ఉండనున్నాయి.
OnePlus Ace2 Pro ధర ఎంతంటే..?
వన్‌ప్లస్ ఏస్ 2 ప్రోలో మూడు వేరియంట్లు ఉన్నాయి. ఇందులో 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ చైనాలో 2,999 యెన్‌లో ఉండగా.. భారతీయ కరెన్సీలో సుమారు రూ.34,100 వరకు ఉండనున్నది. 16జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వచ్చే మరో వేరియంట్ మొబైల్ ధర 3,399 యెన్లు కాగా.. భారత్‌లో సుమారు రూ.38,600 వరకు పలుకనున్నది.
ఇక 24 జీబీ ర్యామ్, వన్ టీబీ వేరియంట్ ధర 3,999 యెన్స్ కాగా.. భారతీయ కరెన్సీలో సుమారు రూ.45,700 వరకు ఉండనున్నది. వన్ ప్లస్ నుంచి వస్తున్న తొలి 24 జీబీ స్మార్ట్ ఫోన్‌గా వన్‌ప్లస్ ఏస్2 పో నిలిచింది. ప్రత్యేకంగా గేమర్స్ కోసం దీన్ని రూపొందించింది. అయితే, భారత్‌లో ఈ మోడల్ ఎప్పుడు లాంచ్ కాబోతుంది ? ధరలు ఎంత ఉండబోతున్నదనే వివరాలు ఇంకా తెలియరాలేదు.