Lion Vs Street Dogs | వీధి కుక్క‌ల దెబ్బ‌కు తోక ముడిచిన సింహాం.. వీడియో

Lion Vs Street Dogs |  అడ‌వికి మృగ‌రాజైన సింహాం( Lion ) గాండ్రిపులు విన‌గానే అటు జంతువుల్లో, ఇటు మ‌నుషుల గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతాయి. సింహా కంట ప‌డ‌కుండా ఉండేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తాం. లేదంటే అది మ‌న‌ల్ని చంపి తినేస్తుంది. కానీ వీధి కుక్క‌లు( Street Dogs ) మాత్రం సింహానికి ముచ్చెట‌మ‌లు ప‌ట్టించాయి. ఊరు నుంచి సింహాన్ని త‌రిమికొట్టాయి కుక్కలు. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో( Social Media ) తెగ వైర‌ల్ […]

  • Publish Date - March 25, 2023 / 12:26 AM IST

Lion Vs Street Dogs | అడ‌వికి మృగ‌రాజైన సింహాం( Lion ) గాండ్రిపులు విన‌గానే అటు జంతువుల్లో, ఇటు మ‌నుషుల గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతాయి. సింహా కంట ప‌డ‌కుండా ఉండేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తాం. లేదంటే అది మ‌న‌ల్ని చంపి తినేస్తుంది.

కానీ వీధి కుక్క‌లు( Street Dogs ) మాత్రం సింహానికి ముచ్చెట‌మ‌లు ప‌ట్టించాయి. ఊరు నుంచి సింహాన్ని త‌రిమికొట్టాయి కుక్కలు. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో( Social Media ) తెగ వైర‌ల్ అవుతోంది.

గుజ‌రాత్‌( Gujarat )లోని ఓ గ్రామంలోకి సింహాం ప్ర‌వేశించింది. ఆ ఊర్లోని ర‌హ‌దారుల‌పై ద‌ర్జాగా తిరుగుతోంది సింహాం. ఇక సింహాన్ని చూసిన వీధి కుక్క‌లు ఏ మాత్రం బెద‌ర‌లేదు. గుంపుగా ఒకేసారి సింహాన్ని కుక్క‌లు చుట్టుముట్టాయి. దీంతో భ‌య‌ప‌డ్డ సింహాం.. అటు నుంచి మెల్లిగా జారుకుంది. గ్రామం నుంచి సింహాం వెళ్లిపోయే వ‌ర‌కు కుక్క‌లు వెంబ‌డించాయి.

ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్టు ఆఫీస‌ర్ సుశాంత నంద తన ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. అడ‌వికి మృగురాజైన సింహా వీధి కుక్క‌ల చేతిలో ఓడిపోయింద‌ని కొంద‌రు కామెంట్ చేశారు. కింగ్ ఆఫ్ ది స్ట్రీట్స్ వ‌ర్సెస్ కింగ్ ఆఫ్ ది జంగిల్ అని మ‌రొకరు ట్వీట్ చేశారు.

Chimpanzee | చనిపోయిందనుకున్న బిడ్డ కనిపించే సరికి.. తల్లి చింపాంజీ భావోద్వేగం

Latest News