సైనికుడి దౌర్జ‌న్యం.. రివాల్వ‌ర్‌తో కాల్చి పాల‌స్తీనీయుడి హ‌త్య‌

విధాత: పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తుందో ఈ ఘటన ఓ మచ్చుతునక. పాలస్తీనాలోని హువారా దక్షిణ నబ్లస్‌ నగరంలో పాలస్తీనీయన్‌ జాతీయున్ని ఇజ్రాయిల్‌ సైనికుడు నిర్బంధించ బోయాడు. దాన్ని అతడు ప్రతిఘటించబోయాడు. దాంతో వారి మధ్య తోపులాట జరిగింది. ఇజ్రాయిల్‌ సైనికుడు తననే ప్రతిఘటిస్తాడా అని రెచ్చిపోయాడు. పాలస్తీనా జాతీయున్ని కిందపడేసి తన్నాడు. అయినా ఆతని కోపం చల్లారలేదో ఏమో… తన దగ్గర ఉన్న రివాల్వర్‌తో కాల్చాడు. ఆ తూటాతో పాలస్తీనీయిన్‌ కుప్పకూలిపోయాడు. ఇజ్రాయిల్ సైనికున్ని […]

  • Publish Date - December 5, 2022 / 09:42 AM IST

విధాత: పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తుందో ఈ ఘటన ఓ మచ్చుతునక. పాలస్తీనాలోని హువారా దక్షిణ నబ్లస్‌ నగరంలో పాలస్తీనీయన్‌ జాతీయున్ని ఇజ్రాయిల్‌ సైనికుడు నిర్బంధించ బోయాడు. దాన్ని అతడు ప్రతిఘటించబోయాడు. దాంతో వారి మధ్య తోపులాట జరిగింది.

ఇజ్రాయిల్‌ సైనికుడు తననే ప్రతిఘటిస్తాడా అని రెచ్చిపోయాడు. పాలస్తీనా జాతీయున్ని కిందపడేసి తన్నాడు. అయినా ఆతని కోపం చల్లారలేదో ఏమో… తన దగ్గర ఉన్న రివాల్వర్‌తో కాల్చాడు. ఆ తూటాతో పాలస్తీనీయిన్‌ కుప్పకూలిపోయాడు.
ఇజ్రాయిల్ సైనికున్ని ఇతరులు వారించటానికి ప్రయత్నించారు. అయినా వారి ప్రయత్నం విఫలమైపోయింది.

ఇజ్రాయిల్‌ సైనికుల ఆగడాలు కొత్తేమీ కాదు. పసిపిల్లలను, మహిళలను సైతం కాల్చి చంపిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వివక్ష, అణిచివేత పూర్వక విధానాలను అంతర్జాతీయ సమాజం ఖండించాలని పాలస్తీనియన్లు కోరుతున్నారు. మానవ హక్కుల ఉల్లంఘనకు ఇజ్రాయిల్‌ నిత్యం పాల్పడుతున్నా పట్టించుకొనే వారే లేకపోవటం నాగరిక ప్రపంచం లక్షణం కాదని అంటున్నారు.