Site icon vidhaatha

పేపర్ లీక్ కామన్.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

భగ్గుమంటున్న విపక్షాలు ,నిరుద్యోగులు

విధాత: పేపర్ల లీకులు కామన్ అంటూ రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంచలనం వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియా తో మాట్లాడుతూ పేపర్ల లీకేజీలు సర్వసాధారణ అంశమని తేలిగ్గా మాట్లాడారు. ఒకవైపు TSPSC పేపర్ల లీకేజీ అంశం రాష్ట్రాన్ని అట్టుడికిస్తున్న క్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరుద్యోగులు, విపక్షాలు మండిపడుతున్నాయి.

పేపర్ల లీక్ వంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయని, గతంలో టెన్త్, ఇంటర్ పేపర్లు కూడా లీకయ్యాయన్నారు. పేపర్ లీక్‌లో మంత్రి కేటీఆర్ దోషి అనడం, సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వాలని ప్రతిపక్షాలు మాట్లాడడం సరికాదన్నారు. లీకేజీపై బండి సంజయ్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడని, రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఆయనే ఆధారాలు ఇవ్వాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి డిమాండ్ చేశారు.

కాగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేపర్ల లీకులు సాధారణ వంట చేసిన వ్యాఖ్యలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన పాదయాత్రలో మీడియాతో మాట్లాడుతూ మండిపడ్డారు. పేపర్ లిక్ పై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. బాధ్యత గల పదవిలో ఉండి పేపర్ లుక్ సాధారణ అనడం ఏమిటి అన్నారు ప్రభుత్వం రాజీనామా చేసి మాకు అప్పగిస్తే 24 గంటల్లో ఆధారాలు ఇస్తామన్నారు.

Exit mobile version