Pawan Kalyan | యాగ ఫల సిద్ధిరస్తు..! జనసేన కార్యాలయంలో యాగశాలను సందర్శించిన సినీ ప్రముఖులు

Pawan Kalyan | విధాత: ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న భగవద్గీత శ్లోక వాక్కు ప్రకారం ధర్మ రక్షణ… ప్రజా క్షేమం ఆకాంక్షిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో చేపట్టిన యాగ క్రతువులో తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాతలు సోమవారం పాలు పంచుకున్నారు. మైత్రి మూవీస్ నుంచి వై.రవిశంకర్, డీవీవీ ఎంటర్ టైన్మంట్ నుంచి డీవీవీ దానయ్య, మెగా సూర్యా ప్రొడక్షన్ నుంచి ఏఎం రత్నం, […]

  • Publish Date - June 13, 2023 / 05:05 AM IST

Pawan Kalyan |

విధాత: ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న భగవద్గీత శ్లోక వాక్కు ప్రకారం ధర్మ రక్షణ… ప్రజా క్షేమం ఆకాంక్షిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో చేపట్టిన యాగ క్రతువులో తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాతలు సోమవారం పాలు పంచుకున్నారు.

మైత్రి మూవీస్ నుంచి వై.రవిశంకర్, డీవీవీ ఎంటర్ టైన్మంట్ నుంచి డీవీవీ దానయ్య, మెగా సూర్యా ప్రొడక్షన్ నుంచి ఏఎం రత్నం, ఎస్వీసీసీ నుంచి బీవీఎస్ఎన్ ప్రసాద్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్ కూచిభొట్లతో పాటు ఉస్తాద్ గబ్బర్ సింగ్ చిత్ర దర్శకుci హరీష్ శంకర్ లు యాగశాలకు విచ్చేసి అక్కడ ప్రతిష్ఠించిన దేవతామూర్తులకు నమస్కరించారు.

యాగక్రతువుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలని అభిలషించారు. అక్కడే ఉన్న రుత్వికులతో యాగ విశిష్ఠతను అడిగి తెలుసుకున్నారు. మహా యాగ నిర్వహణా నిమిత్తం వేద మంత్రోచ్ఛరణల నడుమ దేవతామూర్తుల వద్ద ఉంచిన మంత్ర కళశాలకు నమస్కరించి, వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

వారాహిపై సమర సాహసి

యాగశాలలో శాస్త్రోకంగా పూజల అనంతరం నిర్మాతలు, దర్శకుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారితో సమావేశమయ్యారు. కార్యాలయంలోనే ఉన్న వారాహి రథం గురించి అడిగారు. పవన్ కళ్యాణ్ గారు వారందరినీ వారాహి రథం వద్దకు తీసుకెళ్లారు. వారాహి ప్రచార రథం వివరాలు తెలిపారు. వారాహి రథం లోపలికి తీసుకెళ్లి చూపించారు. విజయాలనందించే వారాహి రథంపై సమరాన్ని ఆరంభించే సాహసి వస్తున్నాడని, ఆయనకు విజయాలు కలగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

నవ శకానికి నాంది పలికే యాత్ర

ఈ సందర్భంగా సినీ ప్రముఖులు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ గారు చేపట్టబోయే యాత్ర ఆయన అనుకున్న లక్ష్యాన్ని సిద్ధించే గొప్ప యాత్ర కావాలన్నారు. ప్రజా క్షేమం కాంక్షిస్తూ చేస్తున్న యాగక్రతువులో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందని, యాత్ర సైతం రాజకీయాల్లో నవశకానికి నాంది పలుకుతుందన్నారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తూనే, రాజకీయాల్లోనే రాణించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరిచి పోలేని నాయకుడు కావాలంటూ యాత్రకు సంసిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్ గారిని శుభాభినందనలు తెలిపారు.