విధాత: విశాఖను రాజధానిగా చేయాలంటూ గర్జన నిర్వహించిన రోజే పవన్ కళ్యాణ్ ర్యాలీ జరపడం. ఆ తరువాత అభిమానులు కాస్తా కంట్రోల్ తప్పి మంత్రుల కార్ల మీద దాడులకు దిగడం.. ఇదంతా ఇంకో కొత్త సమస్యకు.. మరో పరిణామానికి దారి తీస్తోంది. మొత్తానికి బిడ్డ చచ్చినా పురిటికంపు పోలేదు అన్నట్లుగా తయారైంది పవన్ పరిస్థితి.
ఎయిర్ పోర్టులో మంత్రులపై జరిగిన దాడి ఘటనలో ఇప్పటికే 300 మందిని గుర్తించిన పోలీసులు ఇప్పుడు వారిని వెతుకుతున్నారు. గర్జన కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో భాగంగా మంత్రులు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. మంత్రులు రోజా జోగి రమేష్ టీటీడీ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఎయిర్ పోర్టులోకి ప్రవేశించగానే వాళ్ళ కార్లపై హఠాత్తుగా దాడులు జరిగాయి.