PhonePe Lite | యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ఫోన్‌పే..! చిన్న పేమెంట్స్‌ కోసం సూపర్‌ ఫీచర్‌..!

PhonePe Lite | కరోనా మహమ్మారి తర్వాత నగదు చెలామణి తగి.. ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరిగాయి. ప్రస్తుతం యూపీఐ యాప్స్‌ను తెగ వాడేస్తున్నది. పలు యాప్స్‌ సైతం క్యాష్‌బ్యాక్‌, గిఫ్ట్‌ కూపన్‌ను అందిస్తున్నాయి. దాంతో ఎక్కువ మంది ఆన్‌లైన్‌ పేమెంట్‌పై ఆసక్తి చూపుతున్నారు. అయితే, యూపీఐ చెల్లింపులు చెసే సమయంలో తప్పనిసరిగా సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్‌ చేయాల్సి వస్తుంది. తాజాగా పిన్‌ ఎంటర్‌ చేయకుండానే ఇకపై చెల్లింపులు చేసుకోవచ్చు. సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్‌ చేయకుండానే చెల్లింపులు చేసేలా […]

  • Publish Date - May 10, 2023 / 02:52 AM IST

PhonePe Lite |

కరోనా మహమ్మారి తర్వాత నగదు చెలామణి తగి.. ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరిగాయి. ప్రస్తుతం యూపీఐ యాప్స్‌ను తెగ వాడేస్తున్నది. పలు యాప్స్‌ సైతం క్యాష్‌బ్యాక్‌, గిఫ్ట్‌ కూపన్‌ను అందిస్తున్నాయి. దాంతో ఎక్కువ మంది ఆన్‌లైన్‌ పేమెంట్‌పై ఆసక్తి చూపుతున్నారు.

అయితే, యూపీఐ చెల్లింపులు చెసే సమయంలో తప్పనిసరిగా సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్‌ చేయాల్సి వస్తుంది. తాజాగా పిన్‌ ఎంటర్‌ చేయకుండానే ఇకపై చెల్లింపులు చేసుకోవచ్చు. సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్‌ చేయకుండానే చెల్లింపులు చేసేలా నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సరికొత్త విధానాన్ని తీసుకువచ్చింది.

యూపీఐ లైట్‌ పేరుతో గతేడాది సెప్టెంబర్‌లో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఫోన్‌పే లైట్‌ను ఫోన్‌పే తీసుకువచ్చింది. ఇందులో కొంత అమౌంట్‌ను యాడ్‌ చేసుకోవచ్చు. అలా యాడ్‌ చేసుకున్న అమౌంట్‌ను చిన్న చిన్న పేమెంట్స్‌ను చెల్లించే సమయంలో వాడుకోవచ్చు.

ఈ ఫోన్‌పే లైట్‌లో గరిష్ఠంగా రూ.2వేల వరకు యాడ్‌ చేసుకోవచ్చు. ఒకేసారి గరిష్ఠంగా రూ.200 వరకు మాత్రమే చెల్లింపు చేయవచ్చు. ఈ విధానంతో బ్యాంకు సర్వర్‌లో ఏదైనా సమస్య ఉన్న సమయంలోనూ పేమెంట్‌ చేసే సమయంలో ఇబ్బంది ఉండదు.

ఫోన్‌పే లైట్‌ యాక్టివ్‌ ఎలా చేసుకోవాలంటే..?

ఫోన్‌పే లైట్‌ను యాక్టివేట్‌ చేసుకునేందుకు ఈ టిప్స్‌ను ఫాలోకండి. మీ మొబైల్‌లో ఫోన్‌ లైట్‌ ఫీచర్‌ యాక్టివేట్‌ చేసుకునేందుకు ఫోన్‌పే లెస్ వర్షన్‌ అప్‌డేట్‌ చేసుకోవాలి. ఫోన్‌ పే ఓపెన్‌ చేసిన సమయంలో ఫోన్‌పే లైట్‌ అని కనిపిస్తుంటుంది. దానిపై క్లిక్‌ చేసిన తర్వాత యూపీఐ పిన్‌ ఎంటర్‌ చేస్తే ఫోన్‌ పే లైట్‌ యాక్టివేట్‌ అవుతుంది.

ఆ తర్వాత మీరు అందులో యాడ్‌ చేయదలచుకున్న మొత్తం ఎంట్‌ చేసి.. యాడ్‌ చేసుకోవచ్చు. గరిష్ఠంగా రూ.2వేలు మాత్రమే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఒకేసారి రూ.200 మాత్రమే చెల్లింపు చూసే అవకాశం ఉంటుంది. ఇది కేవలం రోజువారీ అవసరాలకు చిన్నమొత్తంలో తీసుకువచ్చిన ఫీచర్‌ మాత్రమే. ప్రస్తుతం ఫోన్ పే లైట్‌ వర్షన్ అందుబాటులోకి రావడంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు. బ్యాంక్ సర్వర్‌తో సంబంధం లేకుండా తేలిగ్గా పేమెంట్స్‌ చేసుకోవచ్చని పేర్కొంటున్నారు.

Latest News