Site icon vidhaatha

Police Beat Rowdy Sheeters: నడిరోడ్డుపై రౌడీ షీటర్ల తాట తీసిన పోలీసులు!

Police Beat Rowdy Sheeters:  గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు రౌడీ షీటర్లకు పోలీస్ మర్యదాలను ఏకంగా నడి రోడ్డుపైనే చూపించారు. ఇటీవల కాలంలో పట్టణంలో రౌడీ షీటర్ల ఆగడాలు అధికం కావడంతో పాటు గంజాయి మత్తులో పోలీస్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న తెనాలి పోలీసులు రౌడీషీటర్లు విక్టర్, బాబూలాల్, రాకేష్ లను పట్టుకొచ్చి ఐతనగర్ లోని నడిరోడ్డు పై కూర్చొబెట్టారు. ఓ పోలీస్ నిందితుల కాళ్లపై కాలు పెట్టి అదిమి పట్టుకోగా మరొకరు లాఠీతో నిందితుల పాదాలపై వాచిపోయోలా కోటింగ్ ఇచ్చి తాగా తీశారు. పోలీస్ దెబ్బలకు తాళలేక నిందితులు వామ్మో అంటూ కేకలు, ఆర్తనాదాలు పెట్టారు.  ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పోలీసుల చర్యను కొందరు సమర్థిస్తుండగా..మరికొందరు వారు చట్టాన్నిఅతిక్రమించి కొట్టారని..అలాంటప్పుడు న్యాయస్థానాలు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు మాత్రం పోలీస్ పై దాడి చేసినందుకే..వారు సాటి పోలీసులుగా సీరియస్ గా రియాక్ట్ అయ్యారని..అదే స్ఫూర్తిని..స్టేషన్ కు వచ్చే బాధిత ప్రజలకు న్యాయం చేయడంలోనూ ప్రదర్శిస్తే బాగుండేదంటూ కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version