దళారీలను నమ్మి మోసపోవద్దు.. ‘పోలీసు’ దేహదారుఢ్య పరీక్షలు పారదర్శకం: రంగనాథ్

ఈనెల 8 నుంచి జనవరి 3 వరకు ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌ విధాత, వరంగల్: పూర్తి పారదర్శకంగా పోలీసు శారీరక దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా వరంగల్ నూతన పోలీస్ కమినషర్ ఏ.వి రంగనాథ్ పేర్కొన్నారు. ఈనెల 8 నుండి జనవరి 3 వరకు నిర్వహించే స్టయిఫండరీ ట్రైనీ కానిస్టేబుల్‌, సబ్-ఇన్స్ స్పెక్టర్ల దేహ దారుఢ్య పరీక్షల ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందన్నారు. ఎవరైనా తప్పుడు మార్గంలో ఉద్యోగం ఇప్పిస్తామని లేదా మీరు ఊద్యోగం వచ్చే విధంగా సహాయం చేస్తామనే దళారీల […]

  • Publish Date - December 7, 2022 / 11:59 AM IST
  • ఈనెల 8 నుంచి జనవరి 3 వరకు ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌

విధాత, వరంగల్: పూర్తి పారదర్శకంగా పోలీసు శారీరక దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా వరంగల్ నూతన పోలీస్ కమినషర్ ఏ.వి రంగనాథ్ పేర్కొన్నారు. ఈనెల 8 నుండి జనవరి 3 వరకు నిర్వహించే స్టయిఫండరీ ట్రైనీ కానిస్టేబుల్‌, సబ్-ఇన్స్ స్పెక్టర్ల దేహ దారుఢ్య పరీక్షల ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందన్నారు.

ఎవరైనా తప్పుడు మార్గంలో ఉద్యోగం ఇప్పిస్తామని లేదా మీరు ఊద్యోగం వచ్చే విధంగా సహాయం చేస్తామనే దళారీల మాటలను నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని సూచించారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడినా లేదా మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన‌ట్టు సమాచారం అందితే వరంగల్ పోలీస్ కమిషనర్ నంబర్ 9491089100గాని పరిపాలన విభాగం అదనపు డిసిపి: వైభవ్ గైక్వాడ్ నంబర్ 9440795201కు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.