విధాత: ఫీజులు కొలిక్కిరాక పోవడంతో రేపు జరగాల్సిన ఎంసెట్ రెండో విడుత కౌన్సెలింగ్ వాయిదా పడింది. అక్టోబర్ 11 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ జరుగుతుంది.
అక్టోబర్ 11, 12 వ తేదీల్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అక్టోబర్ 12న ధృవపత్రాలు పరిశీలిస్తారు. 12, 13న రెండో విడుత వెబ్ అప్షన్ల ప్రక్రియ ఉంటుంది. 16వ తేదీన ఇంజినీరింగ్ సీట్లు కేటాయిస్తారు.