Preeti Suicide Case | KAMC మెడికో సైఫ్‌పై ఏడాదిపాటు సస్పెన్షన్

Preeti Suicide Case మెడికో ప్రీతిని రాగింగ్‌ చేశాడని ఆరోపణ కేఎంసీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ వెల్లడి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు, సీనియర్ పీజీ విద్యార్థి సైఫ్ ను సస్పెండ్ చేసినట్లు కేఎంసీ యాంటీ ర్యాగింగ్ కమిటీ పేర్కొంది. సైఫ్ పై ఏడాది పాటు బహిష్కరణ విధించినట్లు కాలేజ్ ప్రిన్సిపల్ మోహన్ దాస్ వెల్లడించారు. కాకతీయ […]

  • Publish Date - June 10, 2023 / 11:14 AM IST

Preeti Suicide Case

  • మెడికో ప్రీతిని రాగింగ్‌ చేశాడని ఆరోపణ
  • కేఎంసీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ వెల్లడి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ కాకతీయ మెడికల్
కాలేజీ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు, సీనియర్ పీజీ విద్యార్థి సైఫ్ ను సస్పెండ్ చేసినట్లు కేఎంసీ యాంటీ ర్యాగింగ్ కమిటీ పేర్కొంది. సైఫ్ పై ఏడాది పాటు బహిష్కరణ విధించినట్లు కాలేజ్ ప్రిన్సిపల్ మోహన్ దాస్ వెల్లడించారు.

కాకతీయ మెడికల్ కాలేజ్ అనస్తీయా విభాగంలో పీజీ చదువుతున్న జూనియర్ పీజీ విద్యార్థి ప్రీతి ఫిబ్రవరి 22న వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకుంది. ఆమెను మెరుగైన ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. అదే నెల 26న ఆమె చికిత్స పొందుతూ మరణించింది.

సీనియర్ స్టూడెంట్ సైఫ్ ర్యాగింగ్ చేయడమే కాకుండా, కులం పేరుతో దూషించడం వల్లే ప్రీతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా 70 మంది సాక్షుల విచారణ ఆధారంగా కోర్టులో 970 పేజీల చార్జీషీట్ ఫైల్ చేసినట్లు జూన్ 7న వరంగల్ పోలీసులు తెలిపారు. ప్రీతి
ఆత్మహత్యకు సైఫ్ ర్యాగింగ్ కారణమని భావించిన కాలేజీ అధికారులు అతనిపై సస్పెన్షన్ విధించారు.