Site icon vidhaatha

MUNUGODE: కూసుకుంట్లకు నిరసన.. రాజగోపాల్‌పై దాడి!

విధాత: చండూరు పోలింగ్ కేంద్రంలో వోటింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గో బ్యాక్ అంటూ ఓటర్లు నినాదాలు చేశారు. ఆయన తన అనుచరులతో వచ్చి పోలింగ్ బూత్ లో ప్రచారం చేస్తున్నారంటూ ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు మర్రిగూడ మండలం శివన్నగూడెం పోలింగ్ కేంద్రంలో పరిశీలనకు వెళ్లిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళిని పరిశీలిస్తుండగా నువ్వు దేనికి వచ్చావ్ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగడంతో టీఆర్ఎస్ బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ నెలకొనగా పోలీసులు వారిని చెదరగొట్టారు. రాజగోపాల్ రెడ్డి కాన్వాయ్ పై రాళ్లు రువ్వారు.

Exit mobile version