విధాత, సినిమా: ‘‘ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయ్యింది.. ఇక సినిమాలు మానేసి వెళ్లిపోం. మళ్లీ ఇంకో సినిమా తీస్తాం. సినిమా తప్ప.. మాకు ఇంకోటి ఏదీ తెలియదు..’’ ఇది మొదటి నుంచి దర్శకుడు పూరీ జగన్నాధ్ చెబుతున్న మాటలు. తన మనసులోని మాటలనే ‘నేనింతే’ సినిమాలో రవితేజతో కూడా చెప్పించాడు. ఇప్పుడు ‘లైగర్’ విషయంలో ఓపెన్‌గా ఆ విషయం చెప్పేశాడు.
తన మనసులోని భావాలను, ఫిలాసఫీని తెలియజేస్తూ తాజాగా ఓ లేఖను పూరీ విడుదల చేశాడు. సినిమా సక్సెస్ అయితే డబ్బులొస్తాయి.. కానీ సినిమా పోతే బోలెడంత జ్ఞానం వస్తుందని పూరీ అంటున్నారు. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు.. జీవితంలో జరిగేవన్నీ అనుభవాలు మాత్రమే. వాటిని సక్సెస్, ఫెయిల్యూర్‌తో కొలవకూడదని పూరీ ఈ లేఖలో తెలిపాడు. మొత్తానికి పూరీని ‘లైగర్’ సినిమా బాగానే వేధిస్తుందనేది ఈ లెటర్ చూస్తుంటే అర్థమవుతోంది.
Dynamic director #PuriJagannadh writes his heart out and clearly mentioned his philosophy towards the life. ❤️@PuriConnects pic.twitter.com/rYnt7DbjWw
—