Site icon vidhaatha

తండ్రి కాబోతున్న రాహుల్ రామ‌కృష్ణ‌.. ట్వీట్ వైర‌ల్

విధాత: ప‌క్కా హైద‌రాబాద్ యాస‌లో మాట్లాడుతూ.. త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న న‌టుడు రాహుల్ రామ‌కృష్ణ రెండు రోజుల క్రితం ఓ శుభ‌వార్త వినిపించాడు. అదేంటంటే.. తాను తండ్రి కాబోతున్న‌ట్లు ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించాడు. త‌న భార్య గ‌ర్భాన్ని చూపిస్తూ.. మా చిన్ని ఫ్రెండ్‌కు హాలో చెప్పండి అంటూ పోస్టు పెట్టాడు రాహుల్. ఆ ట్వీట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇక రాహుల్‌కు శుభాకాంక్ష‌లు వెలువెత్తుతున్నాయి.

అయితే తండ్రి కాబోతున్నాడు స‌రే.. పెళ్లి ఎప్పుడు చేసుకున్నాడు అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. ఆ మధ్య ఒక షోలో మాట్లాడుతూ.. నేను త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు తెలిపాడు. కానీ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు గాని, న్యూస్‌ గాని బయటకు రాలేదు. ఈ ఏడాది మే నెల‌లో ఓ ఫోటోను షేర్ చేశారు.

దాంట్లో త‌న‌కు కాబోయే భార్య‌కు లిప్ కిస్ ఇస్తూ.. త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుంటాన‌ని ట్వీట్ చేశాడు. అయితే గత నెలలో రాహుల్‌, తన భార్యను పరిచయం చేస్తూ ‘నా పిచ్చిని అర్థం చేసుకునే ఒకే ఒక వ్యక్తి’ అని పోస్ట్‌ పెట్టాడు. ఈ పోస్ట్‌తో తనకు పెళ్లి అయినట్లు క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి రాహుల్ రామ‌కృష్ణ తండ్రి కాబోతున్నాడు అన్న మాట‌..

Exit mobile version