rakul preet singh
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరు తెలియని సౌత్ ఇండియన్ ప్రేక్షకులు ఉండరు. అలాగే ఆమె దక్షిణాదితోపాటు ఉత్తరాదిలో కూడా మంచి పేరును, గుర్తింపును తెచ్చుకుంది. పంజాబీ యువతి అయిన రకుల్ ప్రీత్ సింగ్ 2013లో విడుదలైన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో బాగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చింది. రెండు మూడు సంవత్సరాల క్రితం వరకు.. టాప్ హీరోలకు ఆమె మెయిన్ ఛాయిస్‌గా ఉండేది.
రకుల్ పరిశ్రమలోకి వచ్చి దశాబ్ద కాలం పూర్తయింది. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ చిత్రాలలో చేస్తోంది. కాగా శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ నటిస్తున్న భారతీయుడు 2 మూవీలో ఒక హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం రకుల్ చేసిన లేటెస్ట్ చిత్రం ‘ఛత్రీవాలి’. జీ5లో జనవరి 20 నుండి స్ట్రీమ్ అవుతుంది. ఇది సెక్స్ ఎడ్యుకేషన్‌తో కూడిన రొమాంటిక్ కామెడీ చిత్రం. ఈ చిత్రంలో రకుల్ కండోమ్ టెస్టర్ రోల్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి మంచి టాకే వచ్చింది.
గత ఏడాది వరుసగా రకుల్ నాలుగైదు హిందీ చిత్రాలలో నటించింది. ఈ చిత్రాలన్నీ విడుదలయ్యాయి. కానీ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగే క్రమంలో ఏమేం చేసిందో.. తాజాగా విడుదలైన ‘ఛత్రీవాలి’ ప్రమోషన్స్‌లో చెప్పుకొచ్చింది. అప్పటి తన అనుభవాలను మరోసారి షేర్ చేసుకుంది. హీరోయిన్ కావడం అంత సులభం కాదు.
వేల మంది పోటీపడే పరిశ్రమలో అవకాశాలు వచ్చేది ఓ పదిమందికి మాత్రమే. అంత టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఇక అవకాశాల కోసం అమ్మాయిల ప్రయాణం అత్యంత క్లిష్టంగా ఉంటుంది. క్యాస్టింగ్ కౌచ్‌లు, మోసాలు, వేధింపులను దాటి రావాల్సి ఉంటుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరోయిన్ అయినా ప్రతి అమ్మాయి ఎన్నో కష్టాలు అనుభవిస్తే గాని ఆ పొజిషన్‌కు వెళ్లలేదు.
నాకు కూడా బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేదు. దాంతో పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో వేషాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేదానిని. రోజుకు ఐదు నుంచి పది వరకు ఆడిషన్స్ ఇచ్చేదానిని. బ్యాగులో బట్టలు పెట్టుకుని రోజంతా దర్శకులు చుట్టూ తిరిగే దానిని. ఈ క్రమంలో కారులోనే బట్టలు మార్చుకునేదానిని.
కాగా ఒక చిత్రంలో నన్ను హీరోయిన్‌గా తీసుకున్నారు. కానీ కొన్ని రోజులు షూటింగ్ చేశాక నన్ను తప్పించి వేరే హీరోయిన్‌ని తీసుకున్నారు. అందుకు నేను బాధ పడలేదు. కష్టపడకుండా ఏదీ దక్కదు. నేను ఈ స్థాయికి రావడానికి ఎంతో శ్రమించాను.. అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది.