Site icon vidhaatha

ఏంటి బాల‌య్య‌, చిరంజీవి ఫ్యామిలీల‌ మ‌ధ్య ఇంత బాండింగ్ ఉందా!

విధాత‌: బాల‌య్య సార‌థ్యంలో అన్ స్టాపబుల్ షో (UnstoppableWithNBKS4) అప్ర‌తిహాతంగా దూసుకుపోతుంది. ఎప్ప‌టిక‌ప్పుడు స్టార్ హీరోల‌తో, త‌న రేంజ్ న‌టుల‌తో ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తూ టాలీవుడ్‌లో హీరోల మ‌ధ్య ఉన్న బ‌ల‌మైన సంబంధాల‌ను ప్ర‌పంచానికి చూయించ‌డంతో పాటు అంద‌రి ఫ్యాన్స్కు త‌మ మ‌ధ్య ఉన్న బంధాల‌ను, అనుబంధాల‌ను చూయిస్తూ కొత్త ఒర‌వ‌డికి న‌డుం బిగించారు. ఈక్ర‌మంలో ఇటీవ‌ల విక్ట‌రీ వెంక‌టేశ్‌తో నిర్వహించిన ఇంట‌ర్వ్యూ హీరోల మ‌ధ్య ఉన్న బాండింగ్‌ను చూపించి హీరోలు ఇలా ఉంటారా అని తెలియ‌జేసింది. ఈనేప‌థ్యంలో తాజా కొత్త ఎపిసోడ్‌కు రామ్ చరణ్ (Ram Charan) అతిథిగా రాగా బాలకృష్ణ (Balakrishna) ఆసక్తికరమైన విషయాలు అడిగి ఫ్యాన్స్‌కు కొత్త అనుభూతిని పంచారు.

ముందుగా చిరంజీవి ఫ్యామిలీ చెన్నై నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అయిన కొత్తలో బాలకృష్ణ (Balakrishna) తన పిల్లలతో కలిసి చిరంజీవి ఇంటికి వచ్చి ప్ర‌త్యేకంగా అడిగి మ‌రి చ‌ర‌ణ్‌ను త‌మ ఫ్యామిలీతో పాటు నైట్ డిన్నర్‌కి తీసుకెళ్లారనే విషయాన్ని రామ్ చరణ్ (Ram Charan)ఈ సంద‌ర్భంగా గుర్తు చేసి ఓ స‌రికొత్త విష‌యాన్ని వెళ్ల‌డించి అభిమానుల‌కు మంచి అనుభ‌వాన్ని అంద‌జేశారు.

అలాగే అమ్మ క‌న్నా నాన‌మ్మ వంట బాగా చేస్తుంద‌ని చ‌ర‌ణ్ అంటే.. సురేఖ కుకింగ్‌లో రొయ్యలు, ఆమ్లెట్ అదరగొడతారని బాలయ్య తెలప‌డంతో ఆశ్చ‌ర్య పోవ‌డం చ‌ర‌ణ్ వంతు అయింది. ఇక క్లింకార గురించి మాట్లాడుతూ ఆడపిల్ల పుడితే ఇంట్లో అమ్మవారు పుట్టినట్లే అని బాల‌య్య చెప్పి అందుకు సంబంధించిన వీడియోలు ప్ర‌ద‌ర్శించ‌గా చ‌ర‌ణ్ ఎమోషనల్ అయ్యాడు.

ఇప్పటివరకు చిరంజీవితో పోటీ పడ్డానని.. ఇప్పుడు నీతో పోటీ ప‌డుతున్నా అంటూ చరణ్‌తో బాలయ్య సరదాగా ముచ్చటించారు. ఇవేగాక ఇంత‌వరకు మెగా, నందమూరి కుటుంబం మధ్య అనుబంధం గురించి ఎవరికీ తెలియని ప‌లు విషయాలు బ‌య‌ట‌కు తెలిపారు. ఈ ఏపిసోడ్ చూశాక చాలామందికి బ‌య‌ట ఇద్ద‌రి మ‌ధ్య ఓ రేంజ్‌లో వార్ న‌డుస్తుంది, కానీ వారి మ‌న‌సులు ఏంటి ఇంత క‌ల్మ‌శం లేకుండా ఇంత ఫ్రెండ్లీగా ఉంటారా అని చ‌ర్చించుకుంటున్నారు. ఇక త‌దుప‌రి ఎపిసోడ్‌లో రామ్ చ‌ర‌ణ్ త‌న బాల్య‌ మిత్రుడు శ‌ర్వానంద్‌తో ప్ర‌త్య‌క్షంగా, ప్ర‌భాస్‌తో ఫొన్‌లో మాట్లాడే కార్య‌క్ర‌మం టెలికాస్ట్ కానుంది.

Exit mobile version