Today Rasi Phalalu | 10.06.2023 దిన ఫలాలు.. ఆ రాశుల వారు స్పెక్యులేషన్కు దూరంగా ఉండటం మంచిది

Today Rasi Phalalu | దిన ఫలాలు , తేదీ : 10.06.2023; చంద్రచారము కుంభరాశి. మేష రాశి: చంద్రుడు 11వ ఇంట ఉండటం శుభాలను కలుగజేస్తుంది. ఆర్థిక విషయాలతోపాటు, వృత్తి, కుటుంబ విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది. వృషభ రాశి: చంద్రుడు 10వ ఇంట ఉండటం సానుకూలతలు కలుగజేస్తుంది. ఆర్థిక విషయాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయి. గృహ, ఆరోగ్య, కుటుంబ విషయాల్లో చెప్పుకోతగ్గ సానుకూల పరిణామాలు కనిపిస్తాయి. మిథున రాశి: చంద్రుడు 9వ ఇంట ఉండటం ఈ […]

  • Publish Date - June 9, 2023 / 11:10 PM IST

Today Rasi Phalalu | దిన ఫలాలు , తేదీ : 10.06.2023; చంద్రచారము కుంభరాశి.

మేష రాశి: చంద్రుడు 11వ ఇంట ఉండటం శుభాలను కలుగజేస్తుంది. ఆర్థిక విషయాలతోపాటు, వృత్తి, కుటుంబ విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది.

వృషభ రాశి: చంద్రుడు 10వ ఇంట ఉండటం సానుకూలతలు కలుగజేస్తుంది. ఆర్థిక విషయాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయి. గృహ, ఆరోగ్య, కుటుంబ విషయాల్లో చెప్పుకోతగ్గ సానుకూల పరిణామాలు కనిపిస్తాయి.

మిథున రాశి: చంద్రుడు 9వ ఇంట ఉండటం ఈ రాశివారికి ప్రతికూల ప్రభావాలను కలుగజేయవచ్చు. కొన్ని స్వల్ప నష్టాలు, వృత్తిపరమైన సమస్యల కారణంగా మనసు వేదనతో, దిగులుతో ఉంటుంది.

కర్కాటక రాశి: చంద్రుడు 8వ ఇంట ఉండటం ఈ రాశివారికి ప్రతికూల ఫలితాలను ఇవ్వవచ్చు. కొన్ని ఆర్థిక నష్టాలు, సమస్యలు, టెన్షన్ల కారణంగా చిన్నపాటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉన్నది.

సింహ రాశి: చంద్రుడు 7వ ఇంట ఉండటం ఈ రాశివారికి సానుకూల పరిణామాలు కలుగజేస్తుంది. ఆరోగ్యం, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లోని వారు విజయాలను ఆశించవచ్చు.

కన్యా రాశి: చంద్రుడు 6వ ఇంట ఉండటం కలిసి వచ్చే అంశం. ఈ రాశివారికి ఆర్థిక విషయాల్లో గణనీయమైన విజయాలు సిద్ధిస్తాయి. గృహ, ఆరోగ్య, కుటుంబ విషయాల్లోనూ చెప్పుకోతగ్గ ర్పులు గమనిస్తారు.

తులా రాశి: చంద్రుడు 5వ ఇంట ఉండటం ఈ రాశివారికి ప్రతికూల ఫలితాలను ఇవ్వవచ్చు. కొన్ని స్వల్ప నష్టాలు, సమస్యలు ఎదురవుతాయి. దీని కారణంగా మానసిక వేదనకు గురయ్యే అవకాశం ఉన్నది.

వృశ్చిక రాశి: చంద్రుడు 4వ ఇంట ఉండటం ప్రతికూలతలను కలుగజేసే అవకాశం ఉన్నది. కొన్ని నష్టాలు, వృత్తిపరమైన ఇబ్బందుల కారణంగా వివాదాలు, శత్రుత్వాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నది.

ధనూ రాశి: చంద్రుడు 3వ ఇంట ఉండటం సానుకూలతలు కలుగజేస్తుంది. ఆర్థిక, వృత్తి విషయాల్లో సానుకూల సందర్భాలు నెలకొంటాయి. కుటుంబ విషయాల్లోనూ అనుకూల వాతావరణ ఉంటుంది.

మకర రాశి: చంద్రుడు 2వ ఇంట ఉండటం ప్రతికూల ఫలితాలనిచ్చే అవకాశం ఉన్నది. కొన్ని సమస్యల కారణంగా టెన్షన్ను, దిగులును అనుభవించే వీలు ఉన్నది. స్పెక్యులేషన్కు దూరంగా ఉండటం మంచిది.

కుంభ రాశి: చంద్రుడు 1వ ఇంట ఉండటం శుభప్రదం. ఆర్థిక విషయాలతోపాటు, వృత్తి రంగాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ విషయాల్లోనూ సానుకూల వాతావరణం నెలకొంటుంది.

మీన రాశి: చంద్రుడు 12వ ఇంట ఉండటం ప్రతికూల ప్రభావాలను కలుగజేస్తుంది. వృత్తి, వ్యాపార రంగాల్లోని వారికి కొన్ని సమస్యల కారణంగా అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉన్నది.