Rasi Phalalu| జ్యోతిషం, రాశి ఫలాలు అంటే మన తెలుగు వారికి ఏండ్ల తరబడి చెరగని నమ్మకం ఉంది. లేచినప్పటి నుంచి నిద్రించే వరకు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం.అందుకే ప్రతీ రోజూ మన రాశి ఫలాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మన పనులు నిర్వహిస్తూ ఉంటాం. దాని ప్రకారమే నడుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవగానే మొదట చాలామంది వెతికేది వారికి ఆ రోజు ఎలా ఉండబోతుందనే. అలాంటి వారందరి కోసం వారి పేర్ల మీద ఈ రోజు (ఆదివారం, ఫిబ్రవరి 23)న మీరాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం
ఆర్థికంగా హెచ్చుతగ్గులు. అన్నికార్యాల్లో విజయం, అంతటా సౌఖ్యం. శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు. నిరాటంకంగా రోజువారీ కార్యకలాపాలు. అద్భుత శక్తి సామర్థ్యాలు సాధిస్తారు. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభం. బంధు, మిత్రులను కలుస్తారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
వృషభం
వృత్తి, వ్యాపారాలు కలిసివస్తాయి. ప్రయాణాలు ఎక్కువ. అనవసర డబ్బు ఖర్చు. మానసిక ఆందోళన. రాబడి మార్గాలు పెరుగుతాయి. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కళాకారులకు, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కోర్టు కేసుల్లో ఊరట.
మిథునం
ఉద్యోగులకు పదోన్నతులు, అనుకూల స్థానచలనం, సంతృప్తికరంగా కుటుంబ పరిస్థితులు. మనోల్లాసాన్ని ఉంటుంది. పట్టుదలతో కార్యాలు పూర్తి. పిల్లల విషయంలో జాగ్రత్త అవసరం. పారిశ్రామికవేత్తలకు అనుకూల సమయం. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు. శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి.
కర్కాటకం
వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండాలి. బాకీల వసూలులో జాప్యం. ఇతరులతో గౌరవింపబడే ప్రయత్నంలో సఫలం. కుటుంబంతో అసంతృప్తి. మానసిక ఆందోళన. ప్రతి పని ఆలస్యం. విమర్శలను తప్పవు. కొన్ని కార్యాలు వాయిదా పడుతారు. సహోద్యోగులతో స్నేహం పెరుగుతుంది. స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోర్టు కేసుల్లో అనుకూల తీర్పులు.
సింహం
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. తలచిన కార్యాలకు ఆటంకాలు. స్థిరాస్తుల సమస్యల విషయంలో జాగ్రత్త లవసరం. మోసపోయే అవకాశాలు ఎక్కువ. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం. ఆందోళనకరంగా ఆర్థిక పరిస్థితి. నూతన కార్యాలకు దూరంగా ఉండాలి. పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ప్రయాణాలు ఎక్కువ. నిలకడగా అరోగ్యం.
కన్య
చాలా విషయాల్లో ఓపికతో వ్యవహరించాలి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం. ఆవేశంతో కొన్ని పనులు చెడిపోతాయి. తరచూ ప్రయాణాలు. స్వల్పకాల ఆనారోగ్య సమస్యలు వస్తాయి. తీర్థ యాత్రలు చేపడతారు. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన. ఆకస్మిక భయం దూరం. ప్రయాణాల్లో మెలకువ అవసరం. బంధువులతో సంబంధాలు మెరుగు.
తుల
ప్రయత్నకార్యాలకు ఆటంకాలు. విద్యార్థులు, కళాకారులకు అనుకూలం. బంధు మిత్రులతో విరోధం. స్త్రీల కేంద్రంగా శతృబాధలు. కొత్త దుస్తులు, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఒక విషయంతో మనస్తాపం. పిల్లల విషయంలో సడలింపు ఉండాలి. పగ, ప్రతీకారాలు వదిలేయాలి. ఖర్చుల నియంత్రణ అవసరం. స్థిరాస్తుల విషయాల్లో ఆచి తూచి అడుగేయాలి. శ్రమ పెరుగుతుంది.
వృశ్చికం
గౌరవ మర్యాదలు లభిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అనవసర వ్యయప్రయాసలు. వృధా ప్రయాణాలు ఎక్కువ. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. బంధుమిత్రులతో వైరం అవకాశం. శారీరకంగా బలహీనం. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.కోర్టు కేసులలో సానుకూల ఫలితాలు. స్థానచలన సూచనలు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది.
ధనుస్సు
సంతృప్తికరంగా కుటుంబ పరిస్థితులు. ఓపికతో ఉండడం అన్ని విధాలా మేలు. నూతన నిర్మాణ పనులు మొదలు పెడతారు. బంధు, మిత్రులతో విరోధం కలుగకుండా జాగ్రత్తగా ఉండాలి. అనవసర ధనవ్యయం. రుణప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగాలొస్తాయి. లాభసాటిగా వ్యాపారం. అనారోగ్య బాధలు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికి ఆటంకాలు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కష్టానికి కష్టానికి తగి తగిన ప్రతిఫలం. ప్రయాణాల వల్ల లబ్ధి.
మకరం
ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఆకస్మిక ధన లాభం. ప్రయత్న కార్యాల్లో విజయం. బంధు, మిత్రులతో కలయిక. క్రీడాకారులు, రాజకీయరంగాల్లో ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగంలో పదోన్నతి, స్థానచలన సూచనలు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కొత్త కార్యాలకు రూపకల్పన చేస్తారు. స్థిరాస్తుల ద్వారా ఆదాయం.
కుంభం
రావలసిన డబ్బు ఆలస్యం. ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి . దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం, మానసిక ఆనందం అనుభవిస్తారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభం. ఇంట్లో అనుకూల వాతావరణం. ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. ఖర్చులు నియంత్రణ అవసరం.
మీనం
ప్రయాణాలు కలిసివస్తాయి. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలనం. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆర్థిక పరిస్థితిలో మార్పులు. రుణ ప్రయత్నాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి.ఆత్మీయుల సహకారం ఆలస్యం. మానసిక ఆనందం. పేరుప్రతిష్ఠలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది.