విధాత: సినిమా నటులైనా.. వాళ్లూ మనుషులే కదా!.. అదేమి చిత్రమో గానీ.. మన సాధారణ ప్రజల్లో సినిమా వారంటే చిన్న చూపు ఉంది. దానికి కారణాలు అనేకం. ముఖ్యంగా రిలేషన్స్, డేటింగ్ చేయడం, ప్రేమలో పడటం, సహజీవనం చేయడం, రెండు మూడు వివాహాలు చేసుకోవడం వంటి విషయాలతో సాధారణ జనాలలో సినిమా వారి పట్ల చిన్నచూపుకు కారణం అవుతోంది.
హీరో సందీప్ కిషన్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈయన తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించాడు. గౌతమ్ మీనన్ దగ్గర సహాయ దర్శకునిగా కూడా పనిచేశాడు. చెన్నైకి చెందిన తెలుగు కుటుంబంలో జన్మించాడు. ఆయన బంధువులే ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు అయిన చోటా కె నాయుడు, శ్యామ్ కె నాయుడు.
స్నేహగీతం, ప్రస్థానం వంటి చిత్రాలతో పాటు ‘రొటీన్ లవ్ స్టోరీ, గుండెల్లో గోదారి’ వంటి చిత్రాల్లో నటించాడు. కానీ ఆయనకు వచ్చిన పెద్ద హిట్టు తెలుగులో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ మాత్రమే. ఆ తర్వాత డి ఫర్ దోపిడీ, డీకే బోస్, రారా కృష్ణయ్య, జోరు, బీరువా, శమంతకమణి, మనసుకు నచ్చింది, నెక్స్ట్ ఏంటి ,తెనాలి రామకృష్ణ బి ఏ బి ఎల్, ఏ 1 ఎక్స్‌ప్రెస్, గల్లీ రౌడీ వంటి అనేక చిత్రాలు చేసినా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తప్ప ఆయన కెరీర్‌లో సరైన హిట్ లేదు. ఇక ఈయనతో పాటు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ రెజీనా కసాండ్రా. ఇద్దరు సమకాలీకులు.
ఈ భామ కూడా తెలుగులో శివ మనసులో శృతి, రొటీన్ లవ్ స్టోరీ, రారాకృష్ణయ్య, పవర్, పిల్లా నువ్వు లేని జీవితం, ఆచార్య వంటి చిత్రాలలో కనిపించి మెరిపించింది. ప్రస్తుతం తెలుగులో నేనేనా, మరీచిక అనే సినిమాల్లో నటిస్తోంది. సందీప్ కిషన్‌తో పాటు రెజీనా కూడా కాస్త నలుపు, అదేనండీ ఛామనఛాయ అనే చెప్పాలి. అందుకే వారిద్దరూ రా రా కృష్ణయ్య అంటూ సినిమా కూడా చేశారు. ఇక ‘మా నగరం’ గురించి చెప్పాల్సిన పని లేదు.
విషయానికి వస్తే సందీప్ కిషన్, రెజీనాలు ప్రేమలో మునిగి తేలుతున్నారట. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ప్రైవేటు ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గతంలో సందీప్ కిషన్, రెజీనాల మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ కథనాలు విలువడ్డాయి.
కొన్నాళ్లకు అవి సద్దుమణిగాయి. తాజాగా మీడియాలో వీరి ఎఫైర్‌పై రూమర్స్ మరోసారి చెక్కర్లు కొడుతున్నాయి. సందీప్ కిషన్, రెజీనా సన్నిహితంగా ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సదరు ఫోటోలు చూస్తే ఎఫైర్ వార్తలు నిజమే అనిపించక మానదు.
నైట్ పార్టీలు, లొకేషన్స్ ఎంజాయ్ చేస్తున్న ఈ జంట ఒకరితో మరొకరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి ఉన్నారట. ప్రస్తుతం సందీప్ వయసు 35 కాగా రెజీనా వయసు 32. నిజంగా ప్రేమ, దోమ అనేది ఏదైనా ఉంటే పెళ్లి పీటలు ఎక్కడానికి సరైన వయసు అని చెప్పాలి. ఈడు జోడు కూడా బాగుంటుంది. తమిళ అమ్మాయి రెజినా.. తెలుగు తమిళ భాషల్లో చేస్తోంది. సందీప్ కిషన్ తెలుగువాడై తెలుగు తమిళంలో చేస్తున్నాడు.
ప్రస్తుతం సందీప్ కిషన్ ‘మైకేల్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. మరో రెండు తమిళ ప్రాజెక్ట్స్ ఆయన చేతిలో ఉన్నాయి. ఇక రెజీనా విషయానికి వస్తే అరడజను ప్రాజెక్ట్స్ ఖాతాలో ఉన్నాయి. ఇటీవల ఆమె నటించిన ‘శాకిని ఢాకిని’ చిత్రం విడుదలైంది. ఈ లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నివేదా థామస్ మరో హీరోయిన్‌గా నటించింది.