Site icon vidhaatha

మేయర్‌ను వదలని RGV.. ‘కుక్కల మేయర్’ అంటూ పాట విడుదల

విధాత: హైదరాబాద్ లో వీధి కుక్కలు పెచ్చు మీరు ఇష్టానుసారం ప్రజలమీద దాడులు చేస్తున్న దారుణ పరిస్థితి మీద ఆర్జీవీ మళ్ళొక్కసారి స్పందించారు. మొన్నామధ్య ఓ చిన్నారి మీద కుక్కలు దాడి చేసి ప్రాణాలు తీసేసిన సంగతి తెలుగు రాష్ట్రాల్లో వైరల్ ఐంది. ఆ ఘటన మీద సినిమా నటులు, ఎక్కడ స్పందించలేదు.

రాజకీయ నాయకులూ, అది కూడా ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు కానీ ఇంకెవరికి పట్టలేదు. కేసీఆర్, కేటీఆర్ వంటి వారు అది అత్యంత సాధారణ అంశం అన్నట్లుగా లైట్ తీసుకున్నారు. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం గట్టిగానే మాట్లాడారు.

దాదాపు ఐదు వేలు కుక్కలున్న చోట మేయర్ను పడేయాలని, అవి వెంటాడి కరిస్తే తప్ప ఆమెకు విషయం తెలియదని ఆయన చెబుతూ మేయర్ కుక్కలకు అన్నం పెడుతున్న ఫోటోలు ట్వీట్‌కు జత చేశారు.. ఈ పోస్ట్ కూడా జనాల్లోకి బాగా వెళ్ళింది.

ఇక ఆ అంశం మరుగున పడిపోతుందని అందరూ అనుకుంటున్నతరుణంలో ఆర్జీవీ మళ్ళీ నిద్ర లేచారు. ఈసారి అలా ఇలా కాకుండా ఏకంగా కుక్కల మేయర్ అంటూ ఓ టైటిల్ మీద ఒక పాట రిలీజ్ చేసేందుకు సిద్ధం అయ్యారు. శనివారం సాయంత్రం పాటను రిలీజ్ చేస్తాను అంటూ ట్విట్టర్లో ఓ టీజర్ పెట్టారు.

Exit mobile version