Site icon vidhaatha

హైదరాబాద్ ట్రాఫిక్: సత్ఫలితాలిస్తున్న రోప్‌ విధానం

విధాత‌: హైదరాబాద్ న‌గ‌రంలో రోజురోజుకూ పెరిగిపోతున్న వాహ‌నాల‌కు తోడు, ట్రాఫిక్ ర‌ద్దీ కూడా ఎక్కువ అవుతున్న‌ది. గ‌మ్య‌స్థానాల‌కు చేరుకోవాలంటే ఎక్క‌వ స‌మ‌యం ప‌డుతున్న‌ది. త‌క్కువ దూరానికి కూడా గంట‌ల త‌ర‌బ‌డి ట్రాఫిక్‌లో చిక్కుకుని ప్ర‌యాణం చేయాల్సి వ‌స్తుంది. ఇవ‌న్నీ వాహ‌న‌దారుల‌కు చాలా ఇబ్బందులు క‌లిగిస్తున్నాయి. అంతేకాదు అవ్య‌వ‌స‌రంగా వెళ్లాల్సిన ఆంబులెన్స్‌లు కూడా ఒక్కోసారి ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాయి.

దీనికి తోడు కొంత‌మంది వాహ‌న‌దారులు ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తూ త‌మ ఇష్టానుసారంగా వాహ‌నాల‌ను న‌డ‌పుతుండ‌టం మ‌నం నిత్యం చూస్తుంటాం. దీనివ‌ల్ల ఇత‌రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్‌ను నియంత్రించ‌క‌పోతే బెంగ‌ళూరు న‌గ‌ర వాసులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు హైద‌రాబాద్ వాసులు కూడా ఎదుర్కొంటున్నారు.

ఈ ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి ట్రాఫిక్‌ పోలీసులు కొత్తగా తీసుకొచ్చిన రోడ్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పార్కింగ్‌ అండ్‌ ఎంక్రోచ్‌మెంట్‌ (రోప్‌) విధానం సత్ఫలితాలను ఇస్తున్న‌ది. వాహనాదారులు క్రమశిక్షణతో నిబంధనలు పాటించే విధంగా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానా విధిస్తుస్తూ ట్రాఫిక్ నియ‌మాలు పాటించే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

Exit mobile version