Viral Video | బైక్ రైడక్స్ బుల్లెట్ బైక్ అంటే ఎంత్ర క్రేజో చెప్పాల్సిన పని లేదు. ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్‌కు వెళ్లాలంటే వాడేది ఈ బైక్‌నే. పర్యాటక ప్రాంతాలకు వెళ్లిన సమయంలో బైక్ రైడ్స్ ఈ బండ్లను తమ వెంట తీసుకెళ్తుంటారు. ఈ బైక్‌ను చాలా మంది ఓ స్టేటస్ సింబల్‌గా కొనుగోలు చేస్తుంటారు. అయితే, అలాంటి వారిని భయాందోళనకు గురి చేసే ఘటన ఒకటి చోటు చేసుకున్నది. బుల్లెట్ బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. అగ్నికీలల్లో ఆహుతైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన బుల్లెట్ బైక్ ఉన్న వారిలో వణుకుపడుతున్నది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోటార్ సైకిల్‌తో ఓ వ్యక్తి లడఖ్‌లోని నుబ్రా, పాంగాంగ్ ప్రాంతాల మధ్య పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. రోడ్డు పక్కన బైక్‌ను పార్క్ చేసి ఉండగా.. ఒక్కసారిగా ఎలక్ట్రిక్ స్టార్టర్ ఆన్ అయింది. అవడంతోనే బైకులో చిన్నపాటి కదలిక వచ్చి ఒక పక్కకు ఒరిగిపోయింది. మంటలు చెలరేగాయి. అక్కడున్న వారంతా మంటలను ఆపేందుకు ప్రయత్నం చేసినా.. అవన్నీ వ్యర్థమయ్యాయి. అయితే, మంటలు చెలరేగడానికి కారణాలు తెలియరాలేదు. యూట్యూబ్‌లో ట్రిప్పియోగి669 అనే యూజర్ ఈ వీడియోను అప్‌లోడ్ చేయగా.. వైరల్‌గా మారింది. బైక్ వైరింగ్ వ్యవస్థలో లోపం వల్లే స్పార్క్స్ వచ్చి ఉంటాయని, అవే బైకులో మంటలు చెలరేగడానికి కారణమై ఉంటాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.