విధాత: ఇండియన్ మూవీ అభిమానులకు మరో గుడ్ న్యూస్. గత ఏడాది విడుదలైన పాన్ ఇండియా లెవెల్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ చిత్రం కాంతారా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోకి అనువాదమై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. కర్ణాటకలోని భూతకోల సంస్కృతిని ఆధారంగా చేసుకుని రిషబ్ శెట్టి కాంతారా సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్లను వసూలు చేసింది. కేవలం 16 కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం ఈ స్థాయిలో విజయవంతమైందంటే అది మామూలు విషయం కాదు.
ఈ సంతోషకరమైన విషయాన్ని మూవీ మేకర్స్ సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో మరో గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే కాంతారా సినిమా ఆస్కార్ అవార్డులకు క్వాలిఫై అయింది. రిషబ్‌శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఉత్తమ నటుడు, ఉత్తమ చలనచిత్రం కేటగిరీలలో అకాడమీ అవార్డులకు క్వాలిఫై అయింది.
ఆస్కార్ అవార్డులకు క్వాలిఫై అయింది అంటే ఇప్పుడు దాన్ని నామినేట్ చేయడానికి మనం ఓటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే మన దక్షిణాది నుంచి RRR ఆస్కార్‌కు క్వాలిఫై అయింది. నాటు నాటు సాంగ్ కోసం ఒరిజినల్ సాంగ్ విభాగంలో అలాగే ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో RRR షార్ట్ లిస్ట్‌లో కూడా పేరు సంపాదించింది.
ఇప్పుడు ఈ విషయంలో కాంతారా కూడా చేరింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత, నిర్మాణ సంస్థ హోం బలే ఫిలిమ్స్ తెలియజేసింది. గత ఏడాది సెప్టెంబర్ 30న ఈ చిత్రం విడుదల అయింది. సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అచ్యుత్ కుమార్, కిషోర్ కీలక పాత్రలో నటించారు. ఇప్పుడు ప్రధానంగా RRR, కాంతార మధ్య ఓ తెలియని పోటీ నెలకొంది. మరి ఈ రెండు చిత్రాలలో ఇండియాకు ఆస్కార్ అవార్డును ఎవరు తీసుకొస్తారో చూడాల్సి వుంది.