నిఖిల్ భార్య ఎలా రియాక్ట్ అయిందంటే..?
విధాత: నిఖిల్ సిద్ధార్థ్.. ఈ పేరు మొదట ఎవరికీ తెలీదు.. ఈటీవీలో సీరియల్స్ కొన్నింటిలో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఆ తర్వాత సంబరం అనే చిత్రంలో డ్రైవర్‌గా.. అసలు పేరు ఊరు లేని పాత్ర చేసి.. హైదరాబాద్ నవాబ్స్‌కు అసిస్టెంట్ డైరెక్టర్ గానే కాకుండా ఒక కాలేజీ బాయ్ వేషం కూడా వేశాడు.
అతడి సుడి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీడేస్’తో తిరిగిపోయింది. ఇదే అతని మొదటి చిత్రం అనుకోవచ్చు. ఆ తర్వాత యువత, కళావర్ కింగ్, ఓం శాంతి, ఆలస్యం అమృతం, వీడు తేడా, డిస్కో వంటి చిత్రాలతో సాగింది.. కానీ అసలు సిసలైన హిట్ ‘స్వామి రారా’తో అందుకున్నాడని చెప్పాలి. సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అత్యద్భుత విజయం సాధించింది.
ఆ తర్వాత ‘కార్తికేయ’ ఒక హిస్టరీ. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కేక పుట్టించింది. ఆ తర్వాత నుంచి ఆయన రేంజే మారిపోయింది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా, కేశవ్, కిర్రాక్ పార్టీ, అర్జున్ సురవరం’ ఇలా సాగింది ఆయన కెరీర్. ఇక ఇటీవల వచ్చిన ‘కార్తికేయ 2’ అయితే ఓ ప్రభంజనం సృష్టించింది.
బాలీవుడ్‌లో కూడా ఈ చిత్రం ఓ రేంజ్‌లో అతడిని ఇండియా వైడ్‌గా పాపులర్ చేసింది. ప్రస్తుతం ఆయన నటించిన.. సుకుమార్ రచయితగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో జీఏ 2 సంస్థ నిర్మిస్తున్న ‘18 పేజెస్’ విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై రూపొందగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ యంగ్ హీరో గతంలో కరోనా సమయంలో తాను ప్రేమించిన పల్లవి వర్మ అనే డాక్టర్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా నిఖిల్ విడాకులు తీసుకోబోతున్నాడంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు పుట్టుకొచ్చాయి.
తాజాగా 18 పేజెస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. నేను డైవర్స్ తీసుకోబోతున్నానని వచ్చిన వార్తలు చూసి ఆశ్చర్యపోయాను. ఈ వార్తలు స్టుపిడ్‌గా అనిపించాయి. వాటిని చూసి నవ్వుకున్నాను. నేను నా భార్య పల్లవి వర్మ చాలా హ్యాపీగా ఉన్నాము.
ఇలా మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నామని వార్తలు వస్తున్నాయని నా భార్యతో చెప్పగా.. ఆమె రియాక్షన్ మాత్రం నాకు షాక్ ఇచ్చింది. మనం కలిసి ఉన్నాము… వాళ్ళందరికీ చెప్పే విధంగా కలిసి ఒక ఫోటో పెడదామా అని అడిగితే డ్యూడ్ ఏం చెప్తున్నావు…. మనం ఎలా ఉన్నామో మనకు తెలియదా? వాటికి ఎందుకు రియాక్ట్ కావాలి? అని నాకే ఎదురు చెప్పింది.
ఇలాంటి రూమర్స్ చాలా ఫన్నీగా ఉన్నా.. వాస్తవానికి చూసి నేను కూడా ఎంజాయ్ చేస్తానని… ఫన్నీగా తీసుకుంటానని ఆయన అన్నాడు. ఇక ఇలాంటి వార్తలు రాసే సమయంలో మీడియా వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. తమ దృష్టికి వచ్చిన వాటిని కాస్త రియాల్టీ చెక్ చేసుకుని ఉంటే బాగుంటుంది.
లేకపోతే అనవసర న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది.. అని చెప్పాడు. ఇక యూట్యూబ్‌లపై మాట్లాడుతూ.. వీడియో ఒకటి ఉంటే దాని థంబ్ నైల్ మరోరకంగా పెడుతున్నారు. అసలు లోపలికి వెళ్తే అందులో కంటెంట్ ఉండదు. ఈ వీడియోలు చాలా దారుణంగా ఉన్నాయి.
ఈ విషయంపై ఎవరైనా యాక్షన్ తీసుకోవాలి లేదా యూట్యూబ్‌కు సెన్సారైనా ఉండాలని చెప్పుకొచ్చాడు. తన భార్య తనకు చాలా సపోర్టుగా ఉంటుందని.. తన సినిమాలకు రివ్యూ కూడా ఇస్తుందని సంతోషం వ్యక్తం చేశాడు నిఖిల్ సిద్దార్ధ్.