విధాత, సినిమా: సమంత.. ప్రస్తుతం ఈ పేరొక బ్రాండ్‌గా మారిపోయింది. ఈ మధ్యకాలంలో ఆమెపై వస్తున్న వార్తలు, గాసిప్స్.. మరో హీరోయిన్‌పై రాలేదంటే అతిశయోక్తి కానే కాదు. చైతూతో విడాకుల సమయంలో ఆమె పేరు హాట్ టాపిక్‌గా మారింది. ఆ తర్వాత ఆమె చేసే ఎక్స్‌పోజింగ్, సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫొటోలు.. నిత్యం ఆమె గురించే మాట్లాడుకునేలా చేశాయి.
ఇక ఈ మధ్య కాలంలో ఆమెకు ఏదో అయిందనేలా వార్తలు వైరల్ అయ్యాయి.. అవుతున్నాయి. ఆమెకు స్కిన్ ఎలర్జీ వచ్చిందని, దానికోసం చికిత్స తీసుకునేందుకు ఫారిన్ వెళ్లిందనేలా టాక్ వ్యాపించిన విషయం తెలిసిందే.
కానీ, ఆమె మేనేజర్ మాత్రం.. సమంత ఫారిన్ వెళ్లింది స్కిన్ ట్రీట్‌మెంట్ కోసం కాదు అనేలా చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్.. బాలీవుడ్ రీమేక్ నిమిత్తం శిక్షణ కోసం ఫారిన్ వెళ్లినట్లుగా టాక్ వ్యాపించింది.
ఏదైతేనేమి.. కొన్నాళ్లుగా సమంత మాత్రం దర్శనమీయ లేదు. ఆమె ఫారెన్‌లో ఉన్నా కూడా.. ఇక్కడ ఆమె పేరు వైరల్ అవుతూనే ఉంది. అలా ప్లాన్ చేసింది సమంత. సరే ఆ విషయం పక్కన పెడితే..
తాజాగా ఆమె ఫారిన్ నుండి తిరిగి రావడమే కాకుండా.. ఓ యాడ్ షూట్‌లో కూడా పాల్గొంది. తాజాగా ఆ యాడ్ కూడా విడుదలైంది. అయితే ఈ యాడ్‌లో సమంతని చూసిన వారంతా.. అసలా ఫేస్‌లో గ్లో ఏంటి? ఇంతందంగా ఉందేంటి? అనేలా కామెంట్స్ చేస్తున్నారు.
ఆమెనలా చూస్తుంటే.. నిజంగా సమంత ఫారిన్ వెళ్లింది పైన చెప్పుకున్న కారణాల నిమిత్తమైతే కాదని అంటున్నారు. అంతేకాదు, సమంత ఫారిన్ వెళ్లింది సర్జరీ కోసమనేలా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఫేస్‌కి ఆమె ఏదో సర్జరీ చేయించింది కాబట్టే.. ఇన్నాళ్లు ముఖం కనిపించకుండా జాగ్రత్త పడిందని.. ఇప్పుడామె ఫేస్ మెరిసిపోవడానికి కారణం ఆ సర్జరీనే అని అటు బాలీవుడ్, ఇటు సౌత్ ప్రేక్షకులు సైతం మాట్లాడుకుంటుండటం గమనార్హం. మరి ఈ వార్తలపై సమంత ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.