Same-Sex Marriage | స్వలింగ సంపర్కం ఓ మానసిక రుగ్మత.. RSS సర్వే..!

Same-Sex Marriage | స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధతపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. స్వలింగ సంపర్కుల వివాహాలను పలువురు సమర్థిస్తుండగా.. మరికొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (RSS)కు చెందిన సర్వే నిర్వహించింది. స్వలింగ సంపర్కుల వివాహాలను ఈ సర్వే వ్యతిరేకించింది. అంతే కాకుండా స్వలింగ సంపర్కం అనేది ఓ రుగ్మత అని అభిప్రాయపడింది. స్వలింగ సంపర్కం రుగ్మత […]

  • Publish Date - May 6, 2023 / 03:00 AM IST

Same-Sex Marriage |

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధతపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. స్వలింగ సంపర్కుల వివాహాలను పలువురు సమర్థిస్తుండగా.. మరికొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (RSS)కు చెందిన సర్వే నిర్వహించింది. స్వలింగ సంపర్కుల వివాహాలను ఈ సర్వే వ్యతిరేకించింది.

అంతే కాకుండా స్వలింగ సంపర్కం అనేది ఓ రుగ్మత అని అభిప్రాయపడింది. స్వలింగ సంపర్కం రుగ్మత అని చాలా మంది వైద్యులు, నిపుణులు పేర్కొంటున్నారని ఆర్‌ఎస్‌ఎస్ మహిళా విభాగం అనుబంధ సంస్థ సంవర్ధిని న్యాస్ సర్వే పేర్కొంటుంది. స్వలింగ సంపర్కుల వివాహాన్ని గుర్తిస్తే, అది సమాజంలో వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

రాష్ట్ర సేవికా సమితి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు సమాంతరంగా ఉన్న మహిళా సంస్థ సీనియర్ కార్యకర్త మాట్లాడుతూ.. ఆధునిక శాస్త్రం నుంచి ఆయుర్వేదం వరకు ఎనిమిది విభిన్న చికిత్సా పద్ధతుల అభ్యాసకులతో సహా దేశవ్యాప్తంగా సేకరించిన 318 అభిప్రాయాల ఆధారంగా ఈ సర్వే ఆధార పడి ఉందన్నారు.

సర్వే ప్రకారం.. దాదాపు 70 శాతం మంది వైద్యులు, నిపుణులు స్వలింగ సంపర్కం ఒక రుగ్మత అని నమ్ముతున్నారని, అయితే వారిలో 83 శాతం మంది స్వలింగ సంబంధాలలో లైంగికంగా సంక్రమించే వ్యాధులు ఒకరినుంచి మరొకరికి సంక్రమించవచ్చని పేర్కొన్నట్లు తెలిపింది.

అదే సమయంలో స్వలింగ సంపర్కులు తమ పిల్లలను సరిగ్గా పెంచలేరని 67 శాతం కంటే ఎక్కువ మంది వైద్యులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పించడంతోనే వ్యాధి నయంకాదని, సాధారణ స్థితికి రావొచ్చని సంవర్ధిని న్యాస్ సర్వేలో వెల్లడైంది.

ఈ రకమైన మానసిక రుగ్మత ఉన్న రోగులకు కౌన్సెలింగ్‌ ద్వారా నయం చేయవచ్చని పేర్కొంది. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలనే డిమాండ్‌పై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాలని ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం స్వలింగ వివాహాలకు చట్టపరమైన అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారిస్తున్నది. ఈ నేపథ్యంలో సమవర్ధిని న్యాస్ సర్వే నిర్వహించింది. సర్వేపై స్పందించిన 57 శాతానికి పైగా వైద్యులు ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నారని ట్రస్ట్ సీనియర్ కార్యకర్త ఒకరు వెల్లడించారు.

Latest News