Sarath Babu | శరత్‌బాబు చనిపోలేదు.. అవన్నీ తప్పుడు వార్తలు: ఆయన సోదరి

Sarath Babu విధాత‌: సీనియర్ నటుడు శరత్‌ బాబు కన్నుమూసినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలని ఆయన సోదరి కొట్టిపారేశారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని.. త్వరలోనే ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారని ఆమె తెలియజేశారు. అయితే శరత్ బాబు చనిపోయినట్లుగా సీనియర్ నటి ఖుష్భూ ట్వీట్ చేసి.. ఆయనకు నివాళులర్పించారు. దీంతో ఇప్పుడంతా కన్ఫూజన్ నెలకొంది. శరత్ బాబు బతికి ఉన్నారా? చనిపోయారా? ఖుష్భూ ట్వీట్‌ని నమ్మాలా? లేక ఆయన సోదరి చెప్పేది నమ్మాలా? […]

  • Publish Date - May 4, 2023 / 02:19 AM IST

Sarath Babu

విధాత‌: సీనియర్ నటుడు శరత్‌ బాబు కన్నుమూసినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలని ఆయన సోదరి కొట్టిపారేశారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని.. త్వరలోనే ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారని ఆమె తెలియజేశారు.

అయితే శరత్ బాబు చనిపోయినట్లుగా సీనియర్ నటి ఖుష్భూ ట్వీట్ చేసి.. ఆయనకు నివాళులర్పించారు. దీంతో ఇప్పుడంతా కన్ఫూజన్ నెలకొంది. శరత్ బాబు బతికి ఉన్నారా? చనిపోయారా? ఖుష్భూ ట్వీట్‌ని నమ్మాలా? లేక ఆయన సోదరి చెప్పేది నమ్మాలా? అనేలా పరిస్థితి మారింది.

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శరత్ బాబును.. కుటుంబ సభ్యులు హైదరాబాద్ AIG ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మల్టీ ఆర్గాన్స్ దెబ్బతినడంతో.. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా డాక్టర్స్ గుర్తించి.. ఐసీయూలో ఆయనకు చికిత్స చేస్తున్నారు.

అయితే హాస్పిటల్‌లో చేరిన తర్వాత శరత్ బాబు హెల్త్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను డాక్టర్స్‌గానీ, ఆయన ఫ్యామిలీ సభ్యులుగానీ బయటికి రానివ్వకపోవడంతో.. సోషల్ మీడియాలో కొందరు ఆయన చనిపోయినట్లుగా వార్తలు వైరల్ చేశారు. దీంతో శరత్ బాబు కుటుంబ సభ్యురాలైన ఆయన సోదరి మీడియాకు వివరణ ఇచ్చారు.

‘‘సోషల్ మీడియాలో శరత్ బాబుగారి గురించి తప్పుతప్పుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన కాస్త రికవరీ అయ్యారు. ఆయనని ఐసీయూ నుంచి రూమ్‌కి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. తొందరలోనే ఆయన పూర్తిగా కోలుకుని మీడియాతో మాట్లాడతారని ఆశిస్తున్నాను.

సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను..’’ అని ఆయన సోదరి మీడియాకు తెలియజేశారు. దీంతో శరత్ బాబు చనిపోయినట్లుగా ప్రచారం చేసిన వారంతా.. ఆ ట్వీట్స్‌ని డిలీట్ చేస్తున్నారు. అయితే ఖుష్భూ మాత్రం ఇంత వరకు తన ట్వీట్‌ను డిలీట్ చేయలేదు.

Latest News