సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కట్టడి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేబినెట్ సబ్ కమిటీలో హోంశాఖ, పౌరసరఫరాలు, రెవిన్యూ, సమాచార శాఖ మంత్రులు సభ్యులుగా ఉంటారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి అడ్డుకట్టు వేయడానికి చట్టం తీసుకురానున్నారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ఇటీవల కాలంలో ఎరువుల కొరతతో పాటు, అమరావతిలో వరద నీరు వచ్చిందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగిందని రాష్ట్ర మంత్రులు, టీడీపీ నాయకులు మండిపడ్డారు. అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అధికార పార్టీ మండిపడింది. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి అడ్డుకట్టు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే చట్టం తీసుకురానున్నారు.
Chandrababu Naidu : సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కట్టడికి కేబినెట్ సబ్ కమిటీ
