విధాత : భారత ఆటోమొబైల్ రంగంలో మరోసారి తన సత్తా చాటేందుకు రెనాల్ట్ ఇండియా రిపబ్లిక్ డే సందర్భంగా 2026 కొత్త డస్టర్ కారుతో గ్రాండ్ రీఎంట్రీ (Renault Duster comeback)ఇచ్చింది. రెనాల్ట్ ఇండియా 2012లో లాంచ్ చేసిన తన ఐకానిక్ మోడల్ డస్టర్ ను అదుర్స్ అనిపించే సరికొత్త ఆధునిక డిజైన్, ఫీచర్స్ తో సోమవారం భారత మార్కెట్లో రీ రిలీజ్ చేసింది. ప్రెంచ్ కంపనీ రెనాల్ట్ డస్టర్ కొత్త మోడల్ ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న టాటా సియెర్రా, హ్యుండాయ్ క్రేటా, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టాస్ వంటి కార్లతో పోటీ పడనుంది. పెట్రోల్ ఇంజన్ తో వచ్చిన 2026 రెనాల్ట్ డస్టర్ కారు మోడల్, ఫీచర్స్ కార్ల వినియోగదారులను అకట్టుకునేలా ఉన్నాయి. రెనాల్ట్ సంస్థ ఇప్పుడు కొత్త డస్టర్ తో భారత ఆటోమొబైల్ రంగంలో తన వాటా పెంచుకునే ప్రయత్నాన్ని ప్రారంభించింది. సోమవారం నుంచే ఫ్రీ బుకింగ్స్ ప్రారంభమైనట్లుగా రేనాల్ట్ ఇండియా ప్రకటించింది. 7సంవత్సరాల వారెంటీని ప్రకటించింది.
కొత్త రెనాల్ట్ డస్టర్ ఫీచర్స్
కొత్త రెనాల్ట్ డస్టర్ ఫీచర్ల విషయానికొస్తే కొత్త రగ్డ్ డిజైన్ తో ఆధునిక క్యాబిన్ తో ఆకర్షణీయంగా రూపొందించబడింది. 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, (156హెచ్ పీ) మ్యానువల్ సివిటి గేర్ బాక్స్ తో విడుదలైంది.ఇందులో సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, సీవీటీ యూనిట్ ఆప్షన్లు ఉంటాయి. కొత్త డస్టర్ ను కూడా నిస్సాన్ కంపెనీ మిడ్ ఎస్ యూవీ టెక్టాన్ రూపొందించిన కొత్త CMF-B ప్లాట్‌ఫామ్‌పై నిర్మించడం విశేషం.
అడాస్ భద్రత ఫ్యూచర్లు
భద్రత పరంగా, రెనాల్ట్ అడాస్ ఫీచర్‌తో కొత్త డస్టర్ ను రూపొందించింది. 5స్టార్ సేఫ్టీ స్టాండర్స్ ను తీసుకొచ్చారు. ఇంటీరియర్ ఆల్-బ్లాక్ థీమ్‌ను కలిగి ఉంటుంది. అలాగే డ్యూయల్-టోన్ థీమ్ ఆప్షన్ కూడా ఉంది. డ్యాష్‌బోర్డ్ అంతటా మంచి లైటింగ్ లేయర్డ్ లుక్‌ను ఇచ్చారు. డ్రైవర్-సెంట్రిక్ సెంటర్ కన్సోల్‌లో హెక్సాగోనల్ ఏసీ వెంట్స్ ఉన్నాయి.ఆటోమేటిక్ హై/లో బీమ్, క్రూయిజ్ కంట్రోల్, స్పీడ్ లిమిటర్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఫ్రంట్, సైడ్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ వ్యూ కెమెరా వంటి అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. సరికొత్తగా డిజైన్ చేసిన స్లీక్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, కొత్త ఎల్ఈడీ డీఆర్ఎల్లు, రీడిజైన్ చేసిన ఎల్ఈడీ కనెక్టెడ్ టెయిల్‌లైట్లు ఉన్నాయి. వెనుక వైపు ‘సీ’ ఆకారంలో ఉండే టెయిల్‌ల్యాంప్‌లను కలిపే ఎల్ఈడీ స్ట్రిప్ మధ్యలో బ్రాండ్ లోగో కనిపిస్తుంది.
ధృడమైన బాడీ డిజైన్
ఫ్రంట్ బంపర్‌పై బాడీ క్లాడింగ్, వెడల్పాటి ఎయిర్ డ్యామ్‌లు, వృత్తాకార ఫాగ్ ల్యాంప్‌లు ఉన్నాయి. కారు బోనెట్‌పై ఉన్న స్కల్ప్టెడ్ లైన్స్ ఫ్రంట్ ప్రొఫైల్‌కు అగ్రెసివ్ లుక్‌ను ఇస్తాయి. సైడ్ ప్రొఫైల్ విండో లైన్స్ పాత డస్టర్‌ను గుర్తుకు తెస్తాయి. మస్క్యులర్ ఫ్రంట్, రియర్ ఫెండర్లు, వీల్ ఆర్చ్‌లు, డోర్ల వద్ద ఉన్న భారీ క్లాడింగ్, డైమండ్-కట్ అలాయ్ వీల్స్ ఈ 2026 రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీకి మరింత ఆకర్షణీయతను జోడించాయి.డస్టర్‌లో 10-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో), 7.0-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, అర్కామిస్ 3డీ ఆడియో సిస్టమ్, 360-డిగ్రీ 3డీ కెమెరా వంటివి ఉన్నాయి. ఎలక్ట్రానిక్ పానోరోమిక్ సన్ రూఫ్ ఇచ్చారు. కొత్త రెనాల్ట్ డస్టర్ ధర రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల (ఎక్స్-షోరూమ్ ధర) మధ్య ఉండే అవకాశం ఉంది. ఫ్రీ బుకింగ్ చేసిన వారికే ఇంట్రడక్షన్ ప్రైజ్ వెల్లడించనున్నట్లుగా తెలిపింది.
భవిష్యత్తులో రెనాల్ట్ డస్టర్ లో స్ట్రాంగ్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఇంజన్ లతో మరో మూడు మోడల్స్ లాంచ్ చేయనున్నట్లుగా రేనాల్ట్ సంస్థ ప్రకటించింది.
