ఉద్యోగుల అల‌కేష‌న్ జీవో 317పై కేబినెట్ స‌బ్ క‌మిటీ ఏర్పాటు

బీఆరెస్ ప్ర‌భుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు త‌రువాత కేడ‌ర్ అల‌కేష‌న్ చేస్తూ ఇచ్చిన 317 జీవో అసంబ‌ద్దంగా ఉంద‌ని ఉద్యోగులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు

  • Publish Date - February 24, 2024 / 12:15 PM IST

  • ఉత్త‌ర్వులు జారీ


విధాత‌: బీఆరెస్ ప్ర‌భుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు త‌రువాత కేడ‌ర్ అల‌కేష‌న్ చేస్తూ ఇచ్చిన 317 జీవో అసంబ‌ద్దంగా ఉంద‌ని ఉద్యోగులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ జీవోను స‌వ‌రించాల‌ని ఎంతో కాలంగా ఉద్యోగులు కోరుతున్నా నాటి బీఆరెస్ స‌ర్కారు ప‌ట్టించుకోలేద‌న్న విమ‌ర్శలున్నాయి. ఈ జీవో ప్ర‌భావానికి గురైన ఉద్యోగులు అప్ప‌ట్లో పీసీసీ అధ్య‌క్షులుగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డిని, ఇత‌ర కాంగ్రెస్ నేత‌ల‌ను క‌లిశారు.


అధికారంలోకి వ‌చ్చాక స‌మీక్ష చేసి న్యాయం జ‌రిగేలా చూస్తామ‌ని అప్ప‌ట్లో ఉద్యోగుల‌కు హామీ ఇచ్చారు. ఈ మేర‌కు శ‌నివారం రాష్ట్ర ప్ర‌భుత్వం 317 జీవోపై స‌మీక్ష‌కు వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర‌సింహ అధ్య‌క్ష‌న కెబినెట్ స‌బ్ క‌మిటీని ఏర్పాటు చేసింది. ఈ క‌మిటీలో స‌భ్యులుగా మంత్రులు దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు, పొన్నం ప్ర‌భాక‌ర్‌లున్నారు. ఈక‌మిటీ అధ్య‌య‌నం చేసి కెబినెట్‌కు నివేదిక  ఇవ్వ‌నున్న‌ది.

Latest News