విధాత, హైదరాబాద్ : బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా భారీగా తగ్గాయి.24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.8,620 తగ్గి..రూ.1,60,610కి దిగివచ్చింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.7,900 తగ్గి..రూ.1,47,400కు చేరింది. కేవలం రెండు రోజుల్లో రూ. 18,270 తగ్గడం బంగారం ధరల క్షీణతకు నిదర్శనం.
రూ.45వేలు తగ్గిన కిలో వెండి ధర
కిలో వెండి ధర ముందెన్నడులేని రీతిలో పెరుగుదలలో ఆల్ టైమ్ రికార్డులు నమోదు చేసినట్లుగానే..శనివారం తగ్గుదలలోనూ ఒకేసారి రూ.45,000తగ్గి భారీ తగ్గుదల రికార్డును నమోదు చేసింది.ఒకే రోజు రూ.45వేలు తగ్గిన కిలో వెండి ధర మార్కెట్ లో రూ.3,50,000కు పడిపోవడం గమనార్హం. రెండు రోజుల్లోనే కిలో వెండి ధర రూ.60,000 పతనమై ఆల్ టైమ్ రికార్డు మార్కు రూ.4,10,000నుండి రూ.3,50,000కు పడిపోవడం విశేషం.
కమోడిటీ మార్కెట్లలో మార్పులలో ధరల పతనం
చికాగో మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ (CME)లో మార్జిన్ పెంపు ఊహాగానాలు ప్రపంచ కమోడిటీ మార్కెట్లను ఒక్కసారిగా అతలాకుతలం చేశాయి. దీని ప్రభావవంతో బంగారం, వెండి మార్కెట్లలో తీవ్ర స్థాయిలో లాభాల బుకింగ్ ప్రారంభమైంది. దీని ఫలితంగా ఈ విలువైన లోహాల ధరలు భారీగా పడిపోయాయని మార్కెట్ నిపుణుల కథనం. భారత మార్కెట్లో కూడా ఈ అంతర్జాతీయ ప్రభావం స్పష్టంగా కనిపించింది. అందుకే బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ మార్పు కు ట్రంప్ నిర్ణయించిన నేపథ్యంతో డాలర్ బలహీన పడిన పరిణామం కూడా బంగారం, వెండి ధరల క్షీణతపై ప్రభావ చూపాయి.
నిపుణుల అంచనా ప్రకారం సమీప కాలంలో COMEX బంగారం ధర 4,550 డాలర్ల నుంచి 4,900 డాలర్ల మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఇక MCX బంగారం ధర విషయానికి వస్తే రూ. 1,35,000 నుండి రూ. 1,80,000 (10 గ్రాములు) మధ్యన నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే వెండి ధరలు చూసుకున్నట్లయితే.. COMEX వెండి ధర 70 డాలర్ల నుంచి 95 డాలర్ల మధ్యన ఉండే అవకాశం ఉంది. MCX చూసుకుంటే వెండి రూ. 2,50,000 నుంచి రూ. 3,50,000 (కిలో) మధ్యలో ఉండే అవకాశం ఉంది. అధిక రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు మాత్రమే వెండిలో స్వల్ప ట్రేడింగ్‌కు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Medaram Jatara : మేడారం జాతరలో వారు ‘పరిశుద్ధులు’…అంటురోగాలు వెంటాడకుండా చర్యలుIndia’s First Offshore Airport | అరేబియా సముద్రంపై దేశ తొలి విమానాశ్రయం.. ముంబైలో టెక్నాలజీ అద్భుతం
