Gold Silver Price Today | తగ్గిన బంగారం..స్థిరంగా వెండి

అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా బంగారం, వెండి ధరలలో అస్థిరత కొనసాగుతుంది. శుక్రవారం బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 980 తగ్గి రూ. 1,61,240 వద్ద నిలిచింది. వెండి ధర మాత్రం నిలకడగా ఉంది. కిలో వెండి ధర రూ. 2,90,000 వద్ద నిలిచింది.

Gold Silver Price Today

విధాత, హైదారాబాద్ : అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా బంగారం, వెండి ధరలలో అస్థిరత కొనసాగుతుంది. శుక్రవారం బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 980 తగ్గి రూ. 1,61,240 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 900 తగ్గి రూ. 1, 47,800వద్ద కొనసాగుతుంది. వెండి ధర మాత్రం నిలకడగా ఉంది. కిలో వెండి ధర రూ. 2,90,000 వద్ద నిలిచింది.

యుద్దం వేళ తగ్గుదలపై నిపుణుల విస్మయం

పశ్చిమాసియా యుద్ద పరిస్థితుల మధ్య కూడా బంగారం, వెండి ధరలు పడిపోవడం మార్కెట్ నిపుణులను ఆశ్చర్యపరిచింది. పెట్టబడిదారులలో స్తబ్ధత, స్టాక్ మార్కెట్ లో అస్థిరత, యూఎస్ డాలర్ బలపడటం బంగారం ధరల క్షిణతకు కారణం కావచ్చని విశ్లేషిస్తున్నారు. భారతదేశంలో మాత్రం వివాహాలు, ఉగాది వంటి పర్వదినాల నేపధ్యంలో బంగారు ఆభరణాల కొనుగోళ్లు పెరుగుతాయని విశ్లేషకులు సూచిస్తున్నారు. మార్కెట్ నిపుణులు అనుజ్ గుప్తా అంచనాల ప్రకారం..ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం 5 వేల డాలర్ల వద్ద బలమైన మద్దతు పొందుతుండగా.. 5400 డాలర్ల వద్ద ప్రధాన నిరోధాన్ని ఎదుర్కొంటోంది.

2026 దీపావళి వరకు బంగారం 5500 నుంచి 5600 డాలర్ల మధ్యలో కదలాడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వెండి 100 డాలర్ల నుంచి 110 డాలర్ల వరకు చేరే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. బంగారం, వెండి ధరలు ప్రస్తుతానికి తగ్గుదల బాట పట్టినప్పటికి… దీర్ఘకాలంలో మళ్లీ పుంజుకోనున్నాయని స్పష్టం చేశారు. బంగారం,భవిష్యత్తులో 1.70 లక్షల లక్ష్యానికి, వెండి రూ.3,00,000లక్షలకు చేరవచ్చంటున్నారు.

ఇవి కూడా చదవండి :

Chiranjeevi | అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో మెగాస్టార్ సునామీ.. ‘మన శంకర వరప్రసాద్ గారు’కి టీవీలోనూ భారీ టీఆర్పీ
GMC Nallagonda | నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో 62 పోస్టుల‌ భర్తీ.. 16న ఇంట‌ర్వ్యూలు

Latest News